కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మోడీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరిస్తూ కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా మన్మోహన్ సింగ్ భద్రతను పున:సమీక్షించిన కేంద్ర హోంశాఖ.. ఆయనకు ఎస్‌పీజీకి బదులు సీఆర్‌పీఎఫ్ భద్రతను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే మన్మోహన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ప్రస్తుతం ఎస్‌పీజీ భద్రత ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాలకు మాత్రమే పరిమితమైంది.

3,000 మందికి పైగా సిబ్బందితో కూడిన ఎస్‌పీజీ భద్రతను దేశ ప్రధాని, మాజీ ప్రధానులు వారి కుటుంబసభ్యులకు కల్పిస్తారు.