మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్.డి.దేవేగౌడ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. బెంగళూరు పద్మనాభనగర్‌లోని తన నివాసంలోని బాత్‌రూమ్‌లో జారిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర బడ్జెట్‌పై విపక్ష పార్టీల అధినేతలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన అదే రోజు రాత్రి తిరిగి బెంగళూరు చేరుకున్నారు.

అనంతరం శనివారం ఉదయం బాత్‌‌రూమ్‌లో జారిపడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వ్యక్తిగత వైద్యుల సాయంతో చికిత్స అందించినప్పటికీ నొప్పి ఎక్కువగా ఉండటంతో దేవేగౌడను డాక్టర్ జయదేవ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయనను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించినట్లు దేవేగౌడ ఓ ప్రకటనలో తెలిపారు.