Asianet News TeluguAsianet News Telugu

పరువునష్టం కేసులో మాజీ ప్రధాని దేవెగౌడకు షాక్.. రూ.2కోట్ల నష్టపరిహారానికి ఆదేశాలు..

పదేళ్ల క్రితం ఓ కంపెనీకి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు ఓ కోర్టు మాజీ ప్రధాని దేవెగౌడకు షాక్ ఇచ్చింది. ఆ కంపెనీకి నష్టపరిహారంగా రూ. కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఆ కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంలో వాస్తవం ఉందని ఎనిమిదో సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి మల్లన్న గౌడ నిర్ధారించారు. 

Former PM Deve Gowda ordered to pay rs 2 crore to NICE in defamation case - bsb
Author
Hyderabad, First Published Jun 22, 2021, 2:15 PM IST

పదేళ్ల క్రితం ఓ కంపెనీకి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు ఓ కోర్టు మాజీ ప్రధాని దేవెగౌడకు షాక్ ఇచ్చింది. ఆ కంపెనీకి నష్టపరిహారంగా రూ. కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఆ కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంలో వాస్తవం ఉందని ఎనిమిదో సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి మల్లన్న గౌడ నిర్ధారించారు. 

బీదర్ (దక్షిణ) మాజీ ఎమ్మెల్యే అశోక్ ఖేనీ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న నంది ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ప్రైజెస్ (నైస్) గురించి పదేళ్ళ క్రితం ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో దేవెగౌడ చేసిన వ్యాఖ్యల మీద ఈ తీర్పు వెలువడింది. 

2011 జూన్ 28న ఓ కన్నడ వార్తా ఛానల్ ‘గౌడర గర్జనే’ శీర్షికతో దేవెగౌడ ఇంటర్వ్యూను ప్రసారం చేసింద. నైస్ ప్రాజెక్టు ఓ దోపిడీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల వల్ల ఆ కంపెనీకి పరువు నష్టం జరిగిందని కోర్టు నిర్థారించింది. 

ఆ కంపెనీకి నష్టపరిహారంగా రూ. 2 కోట్లు చెల్లించాలని ఆయనను ఆదేశించింది. ఈ ప్రాజెక్టును సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల్లో సమర్థించిన విషయాన్ని ప్రస్తావించింది. పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను అనుమతించినట్లైతే, భవిష్యత్తులో ఇటువంటి భారీ ప్రాజెక్టులను అమలు చేయడం కష్టమవుతుందని తెలిపింది.  

Follow Us:
Download App:
  • android
  • ios