Mumbai: ముంబయి నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి ఎంఎన్‌ఎస్ మాజీ నాయకుడు మహిళపై అత్యాచారం చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
MNS leader arrest: ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్టు ఇస్తానని మాయమాటలతో నమ్మించి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ రాజకీయ నాయకుడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ముంబయి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తానని ఓ మహిళపై అత్యాచారం చేసినందుకు మాజీ ఎంఎన్ఎస్ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఎమ్‌ఎన్‌ఎస్ పార్టీలో ఉన్నత పదవి, ముంబయి సివిక్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తానని ఓ మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఎంఎన్‌ఎస్ మాజీ నాయకుడు వృశాంత్ వాడ్కేను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని వీపీ పోలీస్ స్టేషన్‌లో 43 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్ చతుర్థికి కొన్ని రోజుల ముందు వాడ్కే ఎంఎన్‌ఎస్‌కు రాజీనామా చేశారు. వాడ్కే, బాధితురాలు ఒకే ప్రాంతంలో నివసించేవారు. వాడ్కే వ్యాపారం నిర్వహిస్తుండగా, బాధితురాలు ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. "లాక్‌డౌన్ సమయంలో నిందితులు, బాధితురాలు ఒకరికొకరు తెలుసు.. ఇద్దరిమధ్య స్నేహపూర్వకంగా సంబంధాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే నిందితుడు.. బాధితురాలికి ఎంఎన్ఎస్ పార్టీలో ఉన్నత పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే, BMC ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమెకు టిక్కెట్ లభిస్తుందని చెప్పి ఆమెకు మాయమాటలు చెప్పి.. ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాధితురాలిపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు కూడా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్నామనీ, విచారణ కొనసాగుతున్నదని వీపీ రోడ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ కిషోర్ షిండే తెలిపారు. నిందితుడిని పోలీసు కస్టడీకి తరలించి, భారతీయ శిక్షాస్మృతిలోని అత్యాచారం, మోసం, పరువు నష్టం వంటి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
యూపీలో దళిత బాలికపై అత్యాచారం చేసి నిప్పంటించిన దుర్మార్గులు
ఉత్తరప్రదేశ్ లో మహిళలపై వరుస లైంగికదాడులు, వేధింపులకు సంబంధించిన ఘటనలు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి నిప్పంటించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసుకున్నామనీ, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన యూపీలోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేసి నిప్పంటించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ ప్రభు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని, నిందితులు మొదట బాలికపై అత్యాచారం చేసి, ఆపై డీజిల్ పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సెప్టెంబర్ 7వ తేదీన జిల్లాలోని మాధవ్ తండాలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే, బాధితురాలు తనకు ఎదురైన కష్టాలను వివరిస్తున్న వీడియో శనివారం వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కాలిన గాయాలతో ఉన్న బాలికను సెప్టెంబర్ 7న ఆసుపత్రిలో చేర్చినట్లు ప్రభు విలేకరులకు తెలిపారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై భారత శిక్షాస్మృతి, లైంగిక నేరాలకు వ్యతిరేకంగా బాలల రక్షణ (పోక్సో) చట్టం, షెడ్యూల్ కులాలు/ షెడ్యూల్డ్ తెగల చట్టం కింద శనివారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, అరెస్టు చేసిన నిందితులిద్దరినీ విచారిస్తున్నామని తెలిపారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (సదర్) యోగేష్ కుమార్ మైనర్ బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
