తమిళనాడు మున్పిపల్ ఎన్నికల్లో డీఎంకే నాయకుడిపై దాడి చేశారనే ఫిర్యాదుతో మంత్రి డి.జయకుమార్ అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు 40 మంది అన్నాడీఎంకే కార్యకర్తలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. 

త‌మిళ‌నాడు (tamilnadu) లో శనివారం జరిగిన మున్సిపల్ (muncipal) ఎన్నికల సందర్భంగా డీఎంకే (dmk)కు చెందిన వ్యక్తిపై దాడి చేశార‌నే ఆరోప‌ణ‌లపై మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత డి. జయకుమార్‌ను చెన్నై పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇ.సుందరవతనమ్ (Sundaravathanam) నేతృత్వంలోని సీనియర్ పోలీసు అధికారులు పట్టినంపాక్కంలోని జయకుమార్ (jayakumar) ఇంట్లోకి ప్రవేశించి, అతని కుటుంబ సభ్యుల నుండి తీవ్రమైన వ్యతిరేకత మధ్య ఆయ‌న‌ను అరెస్టు చేశారు. 40 మంది అన్నాడీఎంకే క్యాడర్‌పై కూడా తొండియార్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు, 

ఒక వీడియోలో.. మాజీ మంత్రి నరేష్ (naresh), డీఎంకే నాయ‌కులు క‌లిసి బోగస్ ఓట్లు వేయడానికి ప్రయత్నించారని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఏఐఏడీఎంకే నాయ‌కులు న‌రేష్ చొక్కా తీయించారు. అనంత‌రం ఆ చొక్కాతో చేతుల‌ను క‌ట్టేశారు. ఆ తరువాత బహిరంగంగా ఊరేగించి పోలీసులకు అప్పగించారు. అనంతరం డీఎంకే క్యాడర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జీఏ రోడ్డు నుంచి తూర్పు కాల్మండపం రోడ్డు మధ్య జంక్షన్‌లో జయకుమార్‌ తదితరులు రోడ్‌రోకోకు దిగారు.

నరేష్ ఫిర్యాదు మేరకు తొండియార్‌పేట (tomdiyarpeat) పోలీసులు జయకుమార్‌తో పాటు మరికొందరిపై భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్లు, ఇతర చట్టాల కింద కేసు నమోదు చేశారు. వారిపై సెక్షన్ 147 (అల్లర్లకు శిక్ష), 148 (అల్లర్లు, సాయుధ ఆయుధాలతో) 294 (బి) (బహిరంగంగా అసభ్య పదజాలం మాట్లాడటం), 153 (అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం) 355 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

జయకుమార్‌ అరెస్టును ఖండిస్తూ ఆయన కుమారుడు, మాజీ ఎంపీ జయవర్ధన్‌ అన్నాడీఎంకే మద్దతుదారులతో కలిసి నుంగంబాక్కం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి రాస్తా రోకోకు దిగారు. అయితే మాజీ మంత్రిని జ్యుడీషియల్ రిమాండ్ కోసం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు తరలించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా శనివారం తమపై దాడి చేశారని ఆరోపిస్తూ జయకుమార్ డ్రైవర్ జగన్నాథన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తొండియార్‌పేట పోలీసులు ముగ్గురు డీఎంకె వ్యక్తులను అరెస్టు చేశారు. డీఎంకెకు చెందిన పార్క్ టౌన్‌కు లో నివాసం ఉండే కొలంజినాథన్ (49), తొండియార్‌పేటకు చెందిన శ్రీధర్ (46), పల్లవన్ సలైకి చెందిన సుధాకర్ (43)లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.