కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఆస్పత్రిలో చేరారు. వైరల్ న్యుమోనియా కారణంగా ఊమెన్ చాందీని ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి‌లో చేర్పించారు.

కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన గొంతు క్యాన్సర్‌కు బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. అయితే వైరల్ న్యుమోనియా కారణంగా ఊమెన్ చాందీని ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి‌లో చేర్పించారు. ఆయన కుమారుడు చాందీ ఊమెన్ తన సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారాన్ని వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించాలని అందరినీ కోరారు. ‘‘నాన్న వైరల్ న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరారు. సందర్శకులకు అనుమతి లేదు. మీ అందరి ప్రార్థనలను కోరుతున్నాను’’ అని చాందీ ఊమెన్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. 

ఇక, ఊమెన్ చాందీ రెండుసార్లు కేరళకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఊమెన్ చాందీ గత కొన్నేళ్లుగా గొంతు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే జర్మనీలోని ఒక ఆసుపత్రిలో గొంతు వ్యాధికి లేజర్ శస్త్రచికిత్స చేయించుకున్నారు.