బెంగుళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కరోనా సోకింది. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

తనకు కరోనా సోకిన విషయాన్ని సిద్దరామయ్య ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. డాక్టర్ల సూచన మేరకు తాను ఆసుపత్రిలో చేరినట్టుగా ఆయన తెలిపారు. తనను కలిసినవారంతా ఐసోలేషన్ లో ఉండాలని కోరారు. అంతేకాదు పరీక్షలు కూడ చేయించుకోవాలని ఆయన సూచించారు.

 

మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తనయుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కూడ కరోనా సోకింది.  తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా కార్తీ చిదంబరం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం నాడు  ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలిపారు.

also read:కరోనా రోగుల నుండి ఫిర్యాదులు: డెక్కన్ ఆసుపత్రిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు

ఆదివారం నాడు  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమిత్ షా ను ఇటీవల కలిసిన కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, బాబుల్ సుప్రియో హోం క్వారంటైన్ లో ఉంటున్నారు.