మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నేత అజీజ్ ఖురేషీ మృతి..
ఉత్తరాఖండ్, మిజోరాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్ గా సేవలు అందించిన అజీజ్ ఖురేషీ (Aziz Qureshi passes away) కన్నుమూశారు. గత కొంత కాలంగా వృధాప్య సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం చనిపోయారు.
మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నేత అజీజ్ ఖురేషీ మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భోపాల్ లోని ఓ హాస్పిటల్ లో 83 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఈ విషయం తెలియడంతో మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ హాస్పిటల్ కు చేరుకున్నారు. కుటుంబ సభ్యులను సభ్యులను పరామర్శించారు.
ఫేమస్ రామేశ్వరం కేఫ్ లో పేలుడు.. నలుగురికి గాయాలు
కాంగ్రెస్ సీనియర్ నేత ఖురేషీ మృతి పట్ల రాజకీయ వర్గాల్లోని పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. 1941లో ఏప్రిల్ 24న అజీజ్ ఖురేషీ భోపాల్ లో జన్మించారు. 1973లో మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 1984 లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని సత్నా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.
ఉత్తరాఖండ్, మిజోరాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్ గా ఆయన (అదనపు బాధ్యతలు) సేవలు అందించారు. ఖురేషీని 2020 జనవరి 24న అప్పటి మధ్యప్రదేశ్ కమల్ నాథ్ ప్రభుత్వం మధ్యప్రదేశ్ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా నియమించింది.