Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. ఉద్యోగం నుంచి తీసేశారని.. యజమానికి కాల్చి చంపాడు..

ఆఫీసులో ప్రవర్తన సరిగా లేదని ఉద్యోగం నుంచి తొలగించిన ఉద్యోగి.. దారుణానికి తెగబడ్డాడు. మేనేజర్ మీద కాల్పులు జరిపాడు. 

Former employee Shoots Employer In Managers Chest, Noida
Author
First Published Jan 5, 2023, 10:41 AM IST

నోయిడా : ప్రైవేట్ సంస్థల్లో పనితీరు చాలా ముఖ్యం. కాస్త అలసత్వం ప్రదర్శించినా ఉద్యోగానికే ఎసరు వస్తుంది. పనితీరు మెరుగు పరుచుకుంటూ ముందుకు వెళ్లాలి కానీ.. కోపానికి వచ్చి.. ద్వేషం పెంచుకుంటే..నష్టపోయేది వారే. అలాంటి ఘటనే జరిగింది నోయిడాలో. మహారాష్ట్రలోని నోయిడాలో ఓ ఉద్యోగి.. తనను జాబ్ నుంచి తీసేశాడని మేనేజర్ మీద కాల్పులు జరిపాడో వ్యక్తి. దీంతో అతని పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు ఆ మాజీ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. 

నోయిడాకు చెందిన ఓ వ్యక్తి బీపీఓలో ఉద్యోగం చేసేవాడు. అతను సరిగా పనిచేయడం లేదని అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో దీనికి కారణం తన మేనేజరే.. అని అతని ఛాతీపై కాల్పులు జరిపాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆస్పత్రికి చేర్చారు. ఐసీయూలో చికిత్స జరుగుతోంది. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మేరకు పోలీసులు బుధవారం వివరాలు తెలిపారు. 

బీజేపీ మతతత్వ విధానాలకు అధికంగా బ‌ల‌వుతున్న‌ది జమ్మూకాశ్మీర్ ప్రజలే.. : మెహబూబా ముఫ్తీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని అశోక్ నగర్‌కు చెందిన అనూప్ సింగ్ నోయిడా సెక్టార్ 2లోని ఎన్‌ఎస్‌బీ బీపీఓలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం, కార్యాలయంలో అతని ప్రవర్తన సరిగా లేదని కంపెనీ సర్కిల్ హెడ్ సద్రుల్ ఇస్లాం.. అనూప్ సింగ్‌ను తొలగించారు. ఒక నెల క్రితం, సింగ్ తన ఉద్యోగం తిరిగి ఇవ్వాలని కోరుతూ ఇస్లాంను సంప్రదించాడు. కానీ అతని అభ్యర్థన సద్రుల్ ఇస్లాం తిరస్కరించాడు.

బుధవారం సాయంత్రం, సింగ్ ఇస్లాం ఆఫీసులోకి వచ్చాడు. మళ్లీ ఉద్యోగం కోసం గొడవ జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సింగ్ దేశీయంగా తయారైన నాటు తుపాకీని తనతో తెచ్చుకున్నాడు. అది బైటికి తీసి ఇస్లాంపై కాల్పులు జరిపాడు. సెక్టార్ 2లోని కార్యాలయంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందిందని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశుతోష్ ద్వివేది తెలిపారు. 

కాల్పుల వల్ల ఇస్లాం ఛాతీకి తీవ్ర గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని కైలాష్ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన సింగ్ కోసం పోలీసు బృందాలు వెతుకుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios