మాజీ రక్షణ శాఖ మంత్రి, సీనియర్ రాజకీయ వేత్త జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. గత కొన్ని సంవత్సరాలుగా అల్జీమర్స్‌తో పాటు వయసుకు సంబంధించిన అనారోగ్యాలతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు.

1930, జూన్ 30న కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ఆయన కేంద్రంలో పరిశ్రమలు, రైల్వే, రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. 1967 నుంచి 2004 వరకు 9 సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. సమతా పార్టీని స్థాపించి ప్రజా పోరాట యోధుడిగా పేరు తెచ్చుకున్నారు.