కాంగ్రెస్ అధినేత్రికి సుస్మితా దేవ్ రాసిన లేఖలో మూడు దశాబ్దాల తన కాంగ్రెస్ అనుబంధంలో ఎందుకు పార్టీనుంచి వెళ్లిపోతున్నాననేదానికి ఎలాంటి రీజన్ చెప్పలేదు. కేవలం "ప్రజా సేవలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను" అని చెప్పింది.

ఢిల్లీ : కాంగ్రెస్ మాజీ ఎంపీ సుస్మితా దేవ్ ఇవాళ పార్టీని వీడారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. దీనికంటే ముందే ఆమె తన ట్విట్టర్ బయోలో తన క్వాలిఫికేషన్ ను "మాజీ సభ్యురాలి"గా మారింది. ఇది ఆమె పార్టీనుంచి వెళ్లిపోతుందనడానికి మొదటి క్లూగా మారింది.

కాంగ్రెస్ అధినేత్రికి సుస్మితా దేవ్ రాసిన లేఖలో మూడు దశాబ్దాల తన కాంగ్రెస్ అనుబంధంలో ఎందుకు పార్టీనుంచి వెళ్లిపోతున్నాననేదానికి ఎలాంటి రీజన్ చెప్పలేదు. కేవలం "ప్రజా సేవలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను" అని చెప్పింది. సుస్మితా దేవ్ కాంగ్రెస్ మహిళా విభాగం, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్‌కు నాయకత్వం వహించింది. పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి కూడా ఆమె నిష్క్రమించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఢిల్లీలో అత్యాచారానికి గురై హత్యకు గురైన తొమ్మిదేళ్ల బాలిక తల్లిదండ్రుల ఫొటోలను పెట్టిన పోస్ట్‌పై ట్విట్టర్ హ్యాండిల్ లాక్ చేసిన కాంగ్రెస్ నాయకులలో దేవ్ కూడా ఉన్నారు. ఈ ఫొటోలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తల్లిదండ్రులతో కలిసిన తర్వాత పోస్ట్ చేసారు. వీటిని చాలామంది షేర్ చేశారు.

రాహుల్ గాంధీ అకౌంట్ బ్లాక్ చేసిన తరువాత సుస్మితా దేవ్ తో సహా అనేకమంది కాంగ్రెస్ ఎంపీలు తమ డిస్ ప్లే పిక్ ని మార్చారు. గత వారం రాహుల్ గాంధీ అకౌంట్ పునరుద్ధరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ "సత్యమేవ జయతే" ని పోస్ట్ చేసింది.