ఛత్తీస్‌ఘడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి శుక్రవారం నాడు మధ్యాహ్నం కన్నుమూశారు. అజిత్ జోగి చనిపోయిన విషయాన్ని ఆయన తనయుడు అమిత్ జోగి ట్విట్టర్ వేదికగా ధృవీకరించారు.

ఈ నెల 9వ తేదీన గుండెపోటు రావడంతో అమిత్ జోగిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  ఇవాళ మరణించాడు.ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అజిత్ జోగి బాధ్యతలు స్వీకరించారు. 2000 నవంబర్ నుండి 2003 నవంబర్ వరకు ఆయన ఈ పదవిలో ఉన్నారు. 2016లో అజిత్ జోగి  కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనతా కాంగ్రెస్ ఛత్తీస్ ఘడ్ (జె) పార్టీని ఏర్పాటు చేశారు.

బుధవారం నాడు రాత్రి కూడ అజిత్ జోగికి గుండెపోటు వచ్చింది. ఈ నెల 9వ తేదీ నుండి ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నాడు. జోగి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.తొలుత ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న అజిత్ జోగి.. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. 

1946 ఏప్రిల్ 29న బిలాస్ పూర్ లో ఆయన జన్మించాడు. భోపాల్ మౌలానా ఆజాద్ కాలేజీలో విద్య అభ్యసించాడు. 1981-85 మధ్య భోపాల్ జిల్లా కలెక్టర్ గా ఆయన పనిచేశాడు.  కాంగ్రెస్ పార్టీలో ఆయన పలు హోదాల్లో పనిచేశాడు. 1998,2004లలో ఆయన లోక్ సభ సభ్యుడిగా పనిచేశారు. 1986-98 మధ్య కాలంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో  నక్సలైట్ల దాడి నుండి నుండి అజిత్ జోగి తృటిలో తప్పించుకొన్నారు.  2013 మే 26వ తేదీన మావోయిస్టులు కాంగ్రెస్ నేతల కాన్వాయ్ పై దాడికి దిగారు. మాజీ కేంద్ర మంత్రులు వీసీ శుక్లా, అజిత్ జోగి కూడ గాయపడ్డారు.

పీసీసీ చీఫ్ నందకుమార్, ఆయన కొడుకు దినేష్ పటేల్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.ఈ ఘటనలో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ కూడ మరణించాడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యంగా మావోలు ఆ సమయంలో దాడికి దిగారు.

ఈ ఘటనలో కాళ్లు కోల్పోయిన అజిత్ జోగి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ నెల మొదటి వారంలో అనారోగ్యానికి గురయ్యారు. ఇవాళ మధ్యాహ్నం మరణించారు.