కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, అసోం మాజీ సీఎం తరుణ్‌ గొగొయి ఆరోగ్యం విషమంగా మారింది. శరీరంలోని పలు అవయవాల పనితీరు క్షీణించిందని, ప్రస్తుతం వెంటిలేటర్‌ సపోర్ట్‌పై ఉన్నట్టు ఆయన తనయుడు, ఎంపీ గౌరవ్‌ గొగొయి వెల్లడించారు. 85 ఏళ్ల గొగొయి అక్టోబర్‌లో అస్వస్థతకు గురికావడంతో గువాహటి వైద్య కళాశాలకు తరలించారు.

నాటి నుంచి గొగొయి అక్కడే ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అనంతరం ప్లాస్మా థెరఫీ చేయించుకోవడం ద్వారా కోలుకున్న తరుణ్ గొగొయ్ అక్టోబర్‌ 25న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మూడు సార్లు అసొం ముఖ్యమంత్రిగా పనిచేసిన గొగొయి ఆరోగ్య పరిస్ధితిని తొమ్మిది మంది వైద్యులతో కూడిన బృందం పర్యవేక్షిస్తోంది.