అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ సోమవారం నాడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.తరుణ్ గొగొయ్ వయస్సు 84 ఏళ్లు. గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకొంటున్నాడు. ఈ ఏడాది ఆగష్టు 25వ తేదీన ఆయనకు కరోనా సోకింది. 

కరోనా తర్వాత తలెత్తిన సమస్యల కారణంగా ఆయన ఈ నెల 2వ తేదీన ఆసుపత్రిలో చేరారు. శ్వాస సంబంధమైన సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరాడు.ఆదివారం నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. పలు అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కిడ్నీ సమస్యలతో ఆయనకు వైద్యులు డయాలసిస్ చేశారు.

గొగొయ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని కోరుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రార్ధనలు నిర్వహించారు.15 ఏళ్లపాటు అసోం రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు.ప్లాస్మా థెరపీని కూడా ఆయనకు అందించారు. నవంబర్ 2 నుండి వెంటిలేషన్ లో ఉన్నాడు.

15 ఏళ్లపాటు అసోం రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు.ప్లాస్మా థెరపీని కూడా ఆయనకు అందించారు. నవంబర్ 2 నుండి వెంటిలేషన్ లో ఉన్నాడు.2021 అసెంబ్లీ ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలందరితో గ్రాండ్ అలయన్స్ ఏర్పాటుకు కాంగ్రెస్ చొరవలో గొగొయ్ కీలకపాత్ర పోషించారు. గొగొయ్ 2001లో అస్సాం ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి ఆయన పార్టీని విజయతీరాలకు నడిపాడు.