తమిళనాడులో డిఎంకె కౌన్సిలర్‌తో సహా కొంతమంది వ్యక్తులు దాడి చేసిన కారణంగా భారత సైనికుడు మరణించిన విషయం తెలిసిందే. ఈ హత్యను ఖండిస్తూ మంగళవారం చెన్నైలో బిజెపి ఆధ్వర్యంలో నిరాహారదీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆర్మీ మాజీ జవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో భారత సైనికుడి హత్యను ఖండిస్తూ నిరసనలు వెల్లువెత్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ హత్యలను ఖండిస్తూ.. నిరసనలు, దీక్షలు చేస్తున్నారు. తాజాగా చెన్నైలోని అన్నా సలై ఒమందూరర్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సైనికుడు, కల్నల్ బి పాండియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఎంకె కౌన్సిలర్‌తో సహా కొంతమంది వ్యక్తులు దాడి చేసిన కారణంగా పనిచేస్తున్న జవాను మరణించడాన్ని ఖండిస్తూ మంగళవారం చెన్నైలో బిజెపి నిర్వహించిన నిరాహారదీక్ష సందర్భంగా ఆర్మీ మాజీ జవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
డిఎంకె కార్యకర్తలకు బెదిరించడం లేదా నేరాలకు పాల్పడడం కొత్త కాదని, చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. వారికి గురించి తెలిసిపోతుందని పాండియన్ అన్నారు. తాను తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాననీ, భారత సైన్యం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సైన్యం, అత్యంత క్రమశిక్షణ కలిగిన సైన్యమని అన్నారు. ఆర్మీ జవాన్లను రెచ్చగొడితే.. తమిళనాడు (డీఎంకే) ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు. మీరు మమ్మల్ని పరీక్షించడానికి ప్రయత్నిస్తే.. అది శాంతిభద్రతల సమస్యలకు దారి తీస్తుందని అన్నాడు పాండియన్.
మాజీ సైనికులు బాంబు దాడులు, కాల్పలు షూటింగ్‌లలో నిష్ణాతులు, అలాగే..భారత ఆర్మీకి పోరాటం మంచి నైపుణ్యముంది. ఈ విషయాలన్నీ మనకు తెలుసు.. కానీ చేయకూడదనుకుంటున్నాం. ఇలాంటి పనులు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.ఇది ఒక హెచ్చరికని ఆయన అన్నారు. చెన్నైలోని అన్నా సలై వద్ద ఒమందూరర్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నిరాహార దీక్ష చేసింది. ఇందులో రాష్ట్ర ఉపాధ్యక్షులు కారు నాగరాజన్, వీపీ దురైసామి, ఇతర బీజేపీ కార్యవర్గలు, వివిధ విభాగాలకు చెందిన రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు.లాన్స్ నాయక్ ప్రభు హత్య, పార్టీ షెడ్యూల్డ్ కులాల విభాగం నాయకుడు తాడ పెరియసామి నివాసంపై దాడిని ఖండిస్తూ ఈ సమ్మె చేపట్టినట్లు బీజేపీ పేర్కొంది.
ఆయన ప్రసంగాన్ని విలేకరులు ప్రశ్నించగా.. పాండియన్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే తాము ఇలాంటి చర్యలకు పాల్పడతామని అన్నారు. ఆర్మీ వ్యక్తిని చంపిన నిందితులకు ప్రభుత్వం కఠిన శిక్ష విధించాలని ఆయన అన్నారు. ఒమాందూరార్ ఆసుపత్రి నుండి వార్ మెమోరియల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీని కూడా బిజెపి ప్లాన్ చేస్తోంది.
ఫిబ్రవరి 14న తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో లాన్స్ నాయక్ ప్రభుపై దాడి జరిగింది. ఈ దాడి ప్రభు ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ మరణించాడు. కృష్ణగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని, తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. సంఘటనలో ఎటువంటి రాజకీయ కోణం లేదని తోసిపుచ్చారు. ఇది ఇద్దరు సన్నిహితుల మధ్య చిన్న వివాదమని పేర్కొంది. కృష్ణగిరి ఎస్పీ సరోజ్ కుమార్ ఠాకూర్ గత వారం విలేకరులతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 8న పోచంపల్లి సమీపంలో పబ్లిక్ వాటర్ ట్యాంక్ వినియోగంపై ప్రభుతో చిన్నసామి గొడవ పడ్డారని, చిన్న గొడవ హత్యకు దారి తీసిందని తెలిపారు.
