ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత, ప్రముఖ కవి కుమార్ విశ్వాస (Kumar Vishwas) మరోసారి సంచనల ఆరోపణలు చేశారు. ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత, ప్రముఖ కవి కుమార్ విశ్వాస (Kumar Vishwas) మరోసారి సంచనల ఆరోపణలు చేశారు. ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లోని వేర్పాటు వాదులకు మద్దతులు ఇస్తున్నారని కుమార్ విశ్వాస్ ఆరోపించారు. స్వతంత్ర దేశానికి (ఖలీస్తాన్) ప్రధాని అవుతానని కేజ్రీవాల్ గతంలో తనతో అన్నాడని చెప్పుకొచ్చారు. ‘ఒకరోజు అతను (అరవింద్ కేజ్రీవాల్) నాకు పంజాబ్ సీఎం అవుతానని లేదా స్వతంత్ర దేశానికి (ఖలిస్తాన్) మొదటి ప్రధాని అవుతానని చెప్పారు’ అని కుమార్ విశ్వాస్ తెలిపారు. అధికారం కోసం కేజ్రీవాల్ ఎంతవరకైనా వెళ్తారని ఆరోపించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన కుమార్ విశ్వాస్.. ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. 2018ల ఆమ్ ఆద్మీ పార్టీ కుమార్ విశ్వాస్‌ను విస్మరించి సంజయ్ సింగ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడంతో ఆయనకు కేజ్రీవాల్‌తో తీవ్ర విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి ఆప్‌ను, కేజ్రీవాల్‌ను లక్ష్యంగా కుమార్ విశ్వాస్ విమర్శలు చేస్తున్నారు. అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
మరోవైపు పంజాబ్‌లో ఆప్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అరవింద్ కేజ్రీవాల్ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌లోని మొత్తం 117 శాసనసభ స్థానాలకు ఫిబ్రవరి 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోగా, ఎస్ఏడీ-బీజేపీ కూటమి 18 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఆప్ 20 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
