జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ లో చోటు చేసుకొన్న సంక్షోభం ముగిసింది. సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో చర్చల తర్వాత కాంగ్రెస్ లో కొనసాగేందుకు సచిన్ పైలెట్ అంగీకరించారు.

దీంతో  రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ కూడ ఓ మెట్టు దిగారు. ఢీల్లీ నుండి రాజస్థాన్ కు సచిన్ పైలెట్ ఈ నెల 11న చేరుకొన్నారు. అదే రోజున సీఎం గెహ్లాట్ జైసల్మేరు చేరుకొన్నారు. ఇక్కడి హోటల్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో  ఆయన సమావేశమయ్యారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మర్చిపోయి క్షమించి ముందుకు సాగండి అని సీఎం గెహ్లాట్ ప్రకటించారు.

నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలను మర్చిపోయి ముందుకు సాగాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది.ఈ సమయంలో తిరుగుబాటుదారులను వారు చేసిన తప్పులను క్షమించాలని ఆయన కోరారు.

also read:రాజస్థాన్‌కు చేరుకొన్న సచిన్ పైలెట్ :ఎలాంటి పదవులు కోరలేదు

తనకు మద్దతుగా 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చేసినట్టుగానే  రాజస్థాన్ రాష్ట్రంలో కూడ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.సచిన్ పైలెట్ తో పాటు  ఆయన వర్గీయులను తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై గెహ్లాట్ వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు.

జూలై 12వ తేదీన గెహ్లాట్ పై సచిన్ పైలెట్ తిరుగుబాటు చేశారు.దీంతో జూలై 14వ తేదీన సచిన్ సహా ఆయన వర్గీయులపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. సచిన్ ను డిప్యూటీ సీఎం తో పాటు పీసీసీ చీఫ్ పదవుల నుండి తప్పించింది.