Asianet News TeluguAsianet News Telugu

Forest Survey report 2021: దేశంలో పెరిగిన అడ‌వులు విస్తీర్ణం.. తెలుగు రాష్ట్రాల్లోనే అధికం !

Forest Survey report 2021: భార‌త్ లో గ‌త రెండేండ్ల‌లో అడ‌వులు, చెట్ల విస్తీర్ణం 2,261 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింద‌ని ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ISFR) 2021 పేర్కొంది. అటవీ విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదలను న‌మోదుచేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ (647 చదరపు కి.మీ.), తెలంగాణ (632 చ.కి.మీ.),  ఒడిశా (537 చ.కి.మీ)లు టాప్-3 ఉన్నాయి. అటవీ సర్వే నివేది-2021ను గురువారం నాడు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ విడుద‌ల చేశారు. 
 

Forest tree cover in India rose by 2261 sq km in 2 yrs: Report
Author
Hyderabad, First Published Jan 13, 2022, 5:04 PM IST

Forest Survey report 2021: భార‌త్ లో గ‌త రెండేండ్ల‌లో అడ‌వులు, చెట్ల విస్తీర్ణం  2,261 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింద‌ని ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ISFR) 2021 పేర్కొంది. అటవీ విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదలను న‌మోదుచేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ (647 చదరపు కి.మీ.), తెలంగాణ (632 చ.కి.మీ.),  ఒడిశా (537 చ.కి.మీ)లు టాప్-3 ఉన్నాయి. అటవీ సర్వే నివేది-2021ను గురువారం నాడు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ విడుద‌ల చేశారు. అడవులను పరిమాణాత్మకంగా సంరక్షించడం మాత్రమే కాకుండా గుణాత్మకంగా సుసంపన్నం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నదని కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్ అన్నారు. ఈ నివేదిక‌లో ప్ర‌స్తావించిన మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

Forest Survey report 2021 వివ‌రాల ప్రకారం.. విస్తీర్ణం ప‌రంగా మధ్యప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. అటవీ విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదలను న‌మోదుచేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ (647 చదరపు కి.మీ.), తెలంగాణ (632 చ.కి.మీ.), ఒడిశా (537 చ.కి.మీ)లు టాప్ ఉన్నాయి. దేశంలోని 17 రాష్ట్రాలు/యూటీలు అటవీ విస్తీర్ణంలో ఉన్న భౌగోళిక ప్రాంతంలో 33 శాతానికి పైగా కలిగి ఉన్నాయి. దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం 4,992 చదరపు కిలోమీటర్లు కాగా, 17 చదరపు కిలోమీటర్ల పెరుగుదల న‌మోదైంది. దేశంలోని మొత్తం అడవులు-చెట్ల విస్తీర్ణం 80.9 మిలియన్ హెక్టార్లు అని, ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 24.62 శాతం అని మంత్రి తెలియజేశారు. 2019 అంచనాతో పోలిస్తే, దేశంలోని మొత్తం అడవులు మరియు చెట్ల విస్తీర్ణంలో 2,261 చదరపు కిలోమీటర్ల పెరుగుదల న‌మోదైంది. ఇందులో అడవుల విస్తీర్ణం 1,540 చ.కి.మీ, చెట్ల విస్తీర్ణం 721 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం పెరుగుదల బహిరంగ అడవులలో అధికంగా ఉంది. త‌ర్వాత చాలా దట్టమైన అడవులు ఉన్నాయి. 

ప్రాంతాల వారీగా మధ్యప్రదేశ్‌లో దేశంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉంది, తర్వాతి స్థానాల్లో అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రలు ఉన్నాయి. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణంలో అధికంగా కలిగిన మొదటి ఐదు రాష్ట్రాలు మిజోరం (84.53%), అరుణాచల్ ప్రదేశ్ (79.33%), మేఘాలయ (76.00%), మణిపూర్ (74.34%), నాగాలాండ్ (73.90%) రాష్ట్రాలు ఉన్నాయి. 17 రాష్ట్రాలు/యూటీలు అటవీ విస్తీర్ణంలో ఉన్న భౌగోళిక ప్రాంతంలో 33 శాతానికి పైగా  అట‌వీ ప్రాంతాన్ని క‌లిగి ఉన్నాయి. ఈ రాష్ట్రాలు,UTలలో, లక్షద్వీప్, మిజోరాం, అండమాన్ & నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్‌, మేఘాలయ  రాష్ట్రాలు/UTలు 75 శాతం కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణం కలిగి ఉండగా, 12 రాష్ట్రాలు/UTలు.. మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, గోవా, కేరళ, సిక్కిం, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, దాద్రా & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ, అసోం, ఒడిశాలో 33 శాతం నుండి 75 శాతం వరకు అడవులు ఉన్నాయి.

దేశంలో మొత్తం మడ అడ‌వుల విస్తీర్ణం 4,992 చ.కి.మీ. 2019 మునుపటి అంచనాతో పోలిస్తే మడ అడవులలో 17 చదరపు కిలోమీటర్ల పెరుగుదల న‌మోదైంది. మడ అడవుల పెరుగుదల‌ను న‌మోదుచేసిన మొదటి మూడు రాష్ట్రాలు ఒడిషా (8 చదరపు కి.మీ), మహారాష్ట్ర (4 చదరపు కి.మీ), క‌ర్నాట‌క‌ (3 చదరపు కి.మీ)లు ఉన్నాయి. దేశంలోని అడవులలో మొత్తం కార్బన్ స్టాక్ 7,204 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది. 2019 చివరి అంచనాతో పోలిస్తే దేశంలోని కార్బన్ స్టాక్‌లో 79.4 మిలియన్ టన్నుల పెరుగుదల ఉంది. కార్బన్ స్టాక్‌లో వార్షిక పెరుగుదల 39.7 మిలియన్ టన్నులు.
 

Follow Us:
Download App:
  • android
  • ios