ఓ ఫారెస్ట్ అధికారి ఓ వీడియోని షేర్ చేశాడు. దానిలో ఓ పులి ఏనుగుల కోసం  దారిచ్చాయి. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మనుషులు ఒకరితో మరొకరు కమ్యూనికేట్ చేసుకోవడం చాలా కామన్. కానీ జంతువులు కూడా మనుషుల్లాగానే కమ్యూనికేట్ చేసుకుంటాయట. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఓ ఫారెస్ట్ అధికారి ఓ వీడియోని షేర్ చేశాడు. దానిలో ఓ పులి ఏనుగుల కోసం దారిచ్చాయి. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

నిజానికి మనకు తెలిసినంత వరకు పులలు ఇతర జంతువులను వేటాడతాయి అనుకుంటాం. కానీ అవి ఏనుగులతో చెలగాటమాడేందుకు ఇష్టపడవు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద షేర్ చేసిన వీడియో, అడవిలో ఏనుగుల గుంపు కోసం ఒక పులి దారి తీస్తున్నట్లు చూపిస్తుంది.
ఏనుగుల గుంపు అటవీ మార్గంలో నడుస్తున్నట్లు వీడియో చూపిస్తుంది, పులి ఏనుగులను గుర్తించిన వెంటనే, పెద్ద పులి కూర్చుని ఏనుగు మంద కోసం వేచి ఉంది. ఏనుగు మంద నెమ్మదిగా ముందుకు సాగుతూ కనిపించింది. ఏనుగు..పెద్ద పిల్లిని చూసింది కానీ దాని గురించి పట్టించుకోలేదు.

Scroll to load tweet…

‘‘జంతువులు ఇలా కమ్యూనికేట్ చేస్తాయి & సామరస్యాన్ని కాపాడుకుంటాయి.’’ అంటూ క్యాప్షన్ జత చేయడం గమనార్హం. ఇది ఎక్కడ జరిగింది అనేది తెలీదు కానీ, నెట్టింట మాత్రం వైరల్ గా మారింది.

ఈ వీడియో ట్విట్టర్‌లో 12,000 వ్యూస్ రాగా, కామెంట్ల వర్షం కురుస్తున్నాయి. "వాట్ ఏ ఎన్‌కౌంటర్. టైగర్ శక్తివంతమైన భూమి క్షీరదానికి తగిన గౌరవం ఇస్తుంది," అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు.

"ఎంత మనోహరమైన దృశ్యం. పులి ఏనుగులకు ఎలా మార్గం సుగమం చేసిందో " అని మరొక నెటిజన్ కామెంట్ చేయడం విశేషం.