Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఉష్ణోగ్రతలు పెరగడంతో అడవుల్లో మంటలు చెలరేగాయి. తాజాగా శ్రీనగర్‌లోని కొన్ని అడవి ప్రాంతాల్లో కారుచ్చు చెలరేగింది. అటవీ శాఖకు అందించిన సమాచారం ప్రకారం.. గర్హ్వాల్ ప్రాంతంలో 32, కుమావోన్ ప్రాంతంలో 75 సార్లు, వన్యప్రాణుల ప్రాంతాలతో కలిపి 117 తాజా అటవీ అగ్ని ప్రమాద సంఘటనలు నమోదయ్యాయి. ఈ మంటల్లో 198.9 హెక్టార్ల అటవీ భూమి ధ్వంసమైందని అటవీ అధికారులు వెల్లడించారు.
Uttarakhand: దేశంలో భానుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఉష్ణోగ్రతలు పెరగడం, పొడి వాతావరణం కారణంగా అడవిలో కార్చిచ్చు చెలరేగింది. తాజాగా.. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. గత 12 గంటల్లో 117 ఘటనలు చోటు చేసుకున్నట్టు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో దాదాపు 198.9 హెక్టార్ల అటవీ భూమి దగ్ధమైనట్టు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
అటవీ శాఖ అధికారులు నిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్విక్ రెస్పాన్స్ టీంలను అందుబాటులో ఉంచినా కార్చిచ్చు మాత్రం ఆగడం లేదు. రోడ్డు పక్క నుంచి కార్చిచ్చు మొదలై చిట్టడవిలోకి మంటలు వ్యాపిస్తున్నాయి. శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాలు అడవికి దగ్గరలో ఉంటాయి. ఈ క్రమంలో... మెడికల్ కాలేజ్ బాలుర హాస్టల్ వరకు ఈ మంటలు వ్యాపించాయి.ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లోని వీర్ చంద్ర సింగ్ గర్వాలీ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్‌లోని బాలుర హాస్టల్‌లోకి మంటలు వ్యాపించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి.
మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు అటవీ శాఖకు అందించిన సమాచారం ప్రకారం.. గర్హ్వాల్ ప్రాంతంలో 32, కుమావోన్ ప్రాంతం 75 మరియు వన్యప్రాణుల ప్రాంతాలతో కలిపి 117 తాజా అటవీ అగ్ని సంఘటనలు నమోదయ్యాయి. కాగా, ఈ మంటల్లో 198.9 హెక్టార్ల అటవీ భూమి ధ్వంసమైందనీ, దాదాపు ₹ 5.28 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్‌లో సోమవారం 27 అటవీ అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి.
అటవీ, అటవీ అగ్ని, విపత్తు నిర్వహణ చీఫ్ కన్జర్వేటర్ నిశాంత్ వర్మ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 న ప్రారంభమైన అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయనీ, ఇప్పటివరకూ దాదాపు 1020.29 హెక్టార్ల అటవీ భూమి కార్చిచ్చుకు ప్రభావితమైందనీ, ఇందులో 724.93 హెక్టార్లు రిజర్వు అటవీ ప్రాంతం పరిధిలోని దని తెలిపారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఏడాది అడవుల్లో మంటలు చెలరేగడంతో ఎలాంటి మానవ ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.
స్థానిక సహకారంతో మంటలను నియంత్రించాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారులను కోరారు. డెహ్రాడూన్ , పరిసర ప్రాంతాలలో మాత్రమే కాకుండా కొండలలో కూడా వేడిగా ఉంటుంది. మంగళవారం డెహ్రాడాన్‌లో గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
యూపీలో అగ్నిప్రమాదం
అలాగే.. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని ఇందిరాపురం ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి.. చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో అక్కడి ప్రదేశం అంతా.. దుమ్ము, ధూళి, పొగతో నిండిపోయింది. వెంటనే స్థానికుల అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
