కేరళలోని అమృతానందమయి మఠంలో ఓ విదేశీ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. ఆమె వయసు 45 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా.. సదరు విదేశీ మహిళ మృతదేహాన్ని కరునాగపల్లి తాలుక హాస్పిటల్ కి తరలించారు.

కాగా.. సాయంత్రం 8గంటల సమయంలో అమృతానందమయి మఠం భవనంపై నుంచి కిందకి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని అందుకే ఆత్మహత్య చేసుకుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

ఆమె యూకేకి  చెందిన మహిళ కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ కి వచ్చింది. అయితే.. లాక్ డౌన్ కారణంగా తిరిగి స్వదేశానికి వెళ్లలేకపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయి ఇలా చేసి ఉండచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.