Forbes Real-Time Billionaires List: ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్‌ను అధిగమించి ప్రపంచంలోని నాల్గవ సంపన్న వ్యక్తిగా నిలిచారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన లాభాపేక్షలేని సంస్థ బిల్ & మెలిండా గేట్స్‌కు తన సంపదలో $20 బిలియన్ల విరాళాన్ని గత వారం ప్రకటించిన తర్వాత బిలియనీర్ల ర్యాంకింగ్‌లు మార్చబడ్డాయి. దీంతో గౌతమ్ అదానీకి ర్యాంకింగ్ పెరిగి బిల్ గేట్స్ ర్యాంక్ దిగజారారు.
Forbes Real-Time Billionaires List: ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సరికొత్త రికార్డు సృష్టించారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీ మైక్రోసాఫ్ట్ యజమాని బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో నాలుగో అత్యంత సంపన్నుడుగా ఘనత సాధించారు. ప్రస్తుతం గౌతమ్ అదానీ సంపద 115.5 బిలియన్ డాలర్లు.
మ్యాగజైన్ ఫోర్బ్స్ (రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా) ప్రకారం.. అదానీ సంపద 2.9 బిలియన్ డాలర్ల నుంచి రాకెట్ లావేగంగా పెరగడం ప్రారంభించిందని..ఈ రోజు అతని సంపద 115 బిలియన్ డాలర్లు దాటిందని ఫోర్బ్స్ గణాంకాలు చెబుతున్నాయి. భారత కరెన్సీలో గౌతమ్ అదానీ సంపద రూ. 91,87,64,32,50,000కి అన్నమాట.
ఈ జాబితా ప్రకారం.. అదానీ సంపద, ఆదాయాలు పెరగడానికి అసలు కారణం అదానీ గ్రూప్ స్టాక్‌లో నిరంతర పెరుగుదల అని పేర్కొనబడింది. దీంతో సంపన్నుల జాబితాలో బిల్ గేట్స్ నాలుగో స్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ ఇప్పటికే ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ఇప్పుడు అతని సంపదలో సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.
గేట్స్ 5వ స్థానానికి ఎందుకు పడిపోయాడు..
ఈ నివేదిక ప్రకార.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన లాభాపేక్షలేని సంస్థ - బిల్ & మెలిండా గేట్స్‌కు తన సంపదలో $ 20 బిలియన్ల విరాళాన్ని గత వారం ప్రకటించిన తర్వాత బిలియనీర్ల ర్యాంకింగ్‌లో మార్పు కనిపించింది. దీంతో గౌతమ్ అదానీకి ర్యాంకింగ్ పెరిగగా.. పారిశ్రామిక వేత్తలు బిలియనీర్ల జాబితాలో బిల్ గేట్స్ ఒక మెట్టు దిగజారారు. బిల్ గేట్స్ తన భార్య మెలిండా గేట్స్‌తో కలిసి సృష్టించిన తన ఫౌండేషన్‌కు తన మొత్తం సంపదను క్రమంగా విరాళంగా ఇస్తానని చెప్పారు.
ఇదే సమయంలో భారతదేశానికి చెందిన రిలయన్స్ గ్రూప్ యజమాని ముఖేష్ అంబానీ 87.7 బిలియన్ డాలర్ల నికర విలువతో ఫోర్బ్స్ జాబితాలో 10వ స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ యొక్క ప్రధాన వ్యాపారం మౌలిక సదుపాయాలు, వస్తువులు, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ ప్రసారం, రియల్ ఎస్టేట్.
అదానీ గ్రూప్ అధినేత ఇటీవల తన 60వ పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవ కోసం రూ.60,000 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. అదానీ ఫౌండేషన్ మేనేజ్‌మెంట్ కింద, ఈ విరాళం మొత్తం ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధికి ఉపయోగించబడుతుంది.
ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిందెవరు?
ఫోర్బ్స్ జాబితాలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలిచారు. అదే మస్క్ ఇటీవలే ట్విట్టర్‌ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుని, ఆ తర్వాత డీల్ నుండి వైదొలిగాడు. అతని నికర విలువ 230 బిలియన్ డాలర్లు. రెండో స్థానంలో లూయిస్ విట్టన్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్, మూడో స్థానంలో అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్ ఉన్నారు. అదానీ గ్రూపునకు చెందిన గౌతమ్ అదానీ నాలుగో స్థానంలో ఉన్నారు. బిల్ గేట్స్ ఐదో స్థానంలో ఉన్నారు.
భారతదేశానికి చెందిన రిలయన్స్ గ్రూప్ యజమాని ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ జాబితాలో పదో స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ నికర విలువ 88 బిలియన్ డాలర్లు. అదే సంవత్సరంలో ముఖేష్ అంబానీని వదిలి ఆసియాలోనే అత్యంత సంపన్నుల కిరీటాన్ని గౌతమ్ అదానీ.. అంబానీ తలపై నుంచి లాక్కొని తాను అలంకరించుకున్నాడు. ఒక సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్నవారిలో అదానీ మొదటి స్థానంలో నిలివడం విశేషం.
