New Delhi: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత ఇక్బాల్ దుర్రానీ.. ప్రాచీన భారతీయ గ్రంథం సామవేదంపై హిందీ, ఉర్దూ భాషల్లో రాసిన పుస్తకాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. సంస్కృతంలో ఉన్న ఈ ప్రాచీన గ్రంథాల‌ను ఆయ‌న అనువ‌దించారు.  

Bollywood direction and producer Iqbal Durrani: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, చిత్ర నిర్మాత ఇక్బాల్ దుర్రానీ, ప్రాచీన భారతీయ గ్రంథం సామవేదంపై హిందీ, ఉర్దూ భాషల్లో రాసిన పుస్తకాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ క్ర‌మంలోనే ఒక ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ పుస్త‌కం రాస్తున్న స‌మ‌యంలో దాదాపు ఆరేండ్ల పాటు ఎలాంటి ప‌నిపెట్టుకోకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. తాను సినిమాల‌కు సైతం దూరంగా ఉన్నానని చెప్పారు. దుర్రానీ మాట్లాడుతూ.. హిందీ, ఉర్దూలో ఉన్న తన పుస్తకాలు ప్రపంచంలోని పురాతన సంస్కృత గ్రంథం సమవేద అనువాద వెర్షన్లు - ఇష్క్ కా తరనా, అంటే ప్రేమ గీతం అని అర్థ‌మ‌ని చెప్పారు. 

బీహార్ కు చెందిన ఇక్బాల్ దుర్రానీ హమ్ తుమ్ దుష్మాన్ దుష్మాన్, గాంధీ సే పెహ్లే గాంధీ, హిందుస్థాన్, దుకాన్, మిట్టి, బేతాజ్ బాద్ షా, ఖుద్దర్, పరదేశి, ధర్తిపుత్ర, నయా జహెర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే, ఆయ‌న ఈ పుస్త‌కాలు రాయ‌డంలో ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ, "నాకు ఎటువంటి ఆదాయ వనరులు లేవు, కానీ నేను కూడా జీవితం కొన‌సాగించారు. నా కుటుంబాన్ని ముంబ‌యిలో ఉంచుకుని ఇలా ఉండ‌టం కష్టమని నాకు తెలుసు.. దీనికి కేటాయించిన స‌మ‌యంలో కోట్ల రూపాయలు సంపాదించవచ్చు.. కానీ రాయ‌డమ‌నేది వదులుకోవడం కష్టం" అని దురానీ అన్నారు.

సామవేదం క్రీస్తుపూర్వం 1500-1200 మధ్య కాలంలో రాయ‌బ‌డిన సంస్కృత శ్లోకాల గ్రంథ్రం. అయితే, దీనిని అనువ‌దించ‌డానికి టూ టైమింగ్ సహకరించకపోవడంతో పుస్తకం రాయడానికి తన సినిమాల పని నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చిందని దుర్రానీ చెప్పారు. ఈ పుస్తకం అనువాదంలో అతి పెద్ద సమస్య సినిమాలతో మమేకం కావడమేనని అన్నారు. ఎందుకంటే.. "నేను సినిమాలకు పనిచేస్తున్నాను.. ఈ స‌మ‌యంలో ఈ పుస్తకాన్ని అనువదించడం చాలా కష్టం. రెండవది, నేను ఫిజిక్స్ స్టూడెంట్ ని, అందులోనూ ఒక ముస్లింను.. ఇలా నా అనువాద రచనకు చాలా విషయాలు అడ్డుగా వచ్చాయి. కానీ అనుకున్న ల‌క్ష్యాన్ని పూర్తి చేశాను" అని చెప్పారు. 

ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో తన పుస్తకాన్ని ఆవిష్కరించారు. 400 సంవత్సరాల క్రితం మొఘల్ యువరాజు దారా షికో ఉపనిష్ ను అనువదించాడనీ, వేదాలను అనువదించాలనుకున్నాడు కానీ అతని సోదరుడు ఔరంగజేబు షాజహాన్ సింహాసనానికి వారసత్వ యుద్ధంలో అతన్ని చంపాడని ఇక్బాల్ దుర్రానీ చెప్పారు. అయితే, ఈ రోజు ప్రధాని మోడీ పాలనలో ఆయన కలను నెరవేర్చుకున్నారు.. ఔరంగజేబు ఓడిపోయాడు, మోడీ గెలిచారు అంటూ వ్యాఖ్యానించారు. మదర్సాల పాఠ్యప్రణాళికలో తన పుస్తకాలను ప్రవేశపెట్టడాన్ని సమర్ధించిన దురానీ , "ఈ పుస్తకాన్ని మదర్సాలలో బోధించాలి, తద్వారా పిల్లలు ఏది సరైనది.. ఏది తప్పు అని తెలుసుకోవచ్చు" అని అన్నారు. ఒక సాధారణ పిల్లవాడిని సరైన మార్గంలో న‌డిపించ‌డానికి ఇది తగిన ఉదాహరణలను కలిగి ఉందన్నారు.

త్వరలోనే డిజిటల్ వెర్షన్ ను కూడా లాంచ్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేయాలని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిపారు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ ల ద్వారా అందరికీ అందుబాటులో ఉండాలనేది త‌న ఆలోచన అని చెప్పారు. సామవేదాను అనువదించడం ఇసుక నదిలో ఈత కొట్టడం లాంటిదని ఇక్బాల్ దురానీ తన కష్టాలను వివరించారు. ఈ పుస్తకాలు జాతీయ ఐక్యతకు ప్రతీకగా ఆయన భావిస్తున్న‌ట్టు చెప్పారు. "ప్రతిచోటా విద్వేషాన్ని బోధిస్తున్న ఈ రోజుల్లో, చరిత్రను తుడిచిపెట్టుకుపోతున్న ఈ రోజుల్లో, జాతీయ ఐక్యత కోసం ప్రేమ గీతాన్ని రాయాలని నిర్ణయించుకున్నానని" ఇక్బాల్ దురానీ అన్నారు. వేదం మూలగ్రంథం కాబట్టి అందరూ తప్పక తెలుసుకోవాలని, చదవాలని ఆయన అన్నారు.

తాను ఎవరిపైనా వేలెత్తి చూపదలుచుకోలేదని, అపోహలను తొలగించడానికి ప్రతి ఒక్కరూ మన ప్రాచీన జ్ఞానాన్ని తెలుసుకోవాలని, చదవాలని ప్రజలందరికీ చెబుతున్నానని" ఆయన అన్నారు. మన విభజన మతం ఆధారంగా కాకుండా చేతల ఆధారంగా జరగాలని ఆయన అన్నారు.