Asianet News TeluguAsianet News Telugu

Maharashtra police: అక్క‌డ పోలీసుల‌కు 8 గంట‌లే డ్యూటీ !

Maharashtra police: మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న పని గంటల సమస్యపై మహారాష్ట్రలో గత కొంత కాలంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మహిళా పోలీసులపై పనిభారం పెరగుతున్నదనీ, దీని కారణంగా వారీ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతున్నదని పలు రిపోర్టులు ఇప్పటికే పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే మ‌హారాష్ట్ర స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర మ‌హిళా పోలీసులు ఇక‌పై 12 గంట‌ల‌కు బ‌దులు ఎనిమిది గంట‌లు విధులు నిర్వ‌ర్తించాల‌ని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సంజయ్ పాండే ఆదేశాలు జారీ జారీ చేశారు.
 

For better work-life balance, women cops in Maharashtra to have eight-hour duty now
Author
Hyderabad, First Published Jan 29, 2022, 12:37 PM IST

Maharashtra police: దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో నేరాలు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. అయితే, నేరాల రేటు త‌గినంత‌గా పోలీసు సిబ్బంది లేక‌పోవ‌డంపై ప్ర‌స్తుతం ఉన్న వారిపై భారం ప‌డుతోంది. పోలీసుల‌పై ప‌ని భారం అధికం అవుతుండ‌టంపై దేశంలో చ‌ర్చ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న పని గంటల సమస్యపై మహారాష్ట్రలో గత కొంత కాలంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మహిళా పోలీసులపై పనిభారం పెరగుతున్నదనీ, దీని కారణంగా వారీ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతున్నదని పలు రిపోర్టులు ఇప్పటికే పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి  ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర మ‌హిళా పోలీసులు ఇక‌పై 12 గంట‌ల‌కు బ‌దులు ఎనిమిది గంట‌పాటు విధులు నిర్వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. దీనికి సంబంధించి రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సంజయ్ పాండే ఆదేశాలు జారీ జారీ చేశారు. మ‌హిళా పోలీసుల ప‌ని గంటల‌కు సంబంధించి డీజీపీ జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో మహిళా సిబ్బందికి  కొత్త‌గా అమ‌ల్లోకి తీసుకువ‌స్తున్న ఎనిమిది గంట‌ల ప‌ని స‌మ‌యం ప్రయోగాత్మకంగా అమలు చేయబడుతుంద‌ని తెలిపారు. 

మహిళా పోలీసుల‌కు ఎనిమిది గంటల డ్యూటీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమలులో ఉంటుందని డీజీపీ త‌న ఉత్తర్వుల్లో స్ప‌ష్టం చేశారు. దీనికి సంబంధించి యూనిట్ కమాండర్లు ఆర్డర్ అమలు చేయబడుతున్న విష‌యాన్ని నిర్ధారించుకోవాలని అందులో పేర్కొన్నారు. మ‌హిళా అధికారుల ఆరోగ్యాన్ని-మెరుగైన ప‌ని తీరును స‌మ‌తుల్యం అందించే చ‌ర్య‌ల్లో భాగంగానే ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు ఒక సీనియ‌ర్ పోలీసు ఉన్న‌తాధికారి వెల్ల‌డించారు. వాస్తవానికి పురుష పోలీసులతో పాటు మహిళా పోలీసులు 12 గంటల పాటు పనిచేయాల్సి  ఉంటుంది. అయితే, నేరాలు పెరుగుతుండ‌టం, దానికి త‌గినంత‌గా సిబ్బంది కొర‌త వంటి కార‌ణాల‌తో పోలీసులు 16, 18 గంటల వ‌ర‌కు ప‌నిచేయాల్సి ప‌రిస్థితులు ఉన్నాయి. 

కాగా, గ‌తేడాది నుంచి పోలీసుల ప‌నిభారం పెరిగిపోతున్న‌ద‌ని పోలీసు సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విష‌యం గురించి ప‌లుమార్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సంజయ్ పాండే.. ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే దృష్టి తీసుకెళ్లారు. మ‌రీ ముఖ్యంగా మ‌హిళా పోలీసుల ఆరోగ్యం, విధుల స‌మ‌తుల్యం చేయ‌డం గురించి చ‌ర్చించారు. ఈ క్ర‌మంలోనే సానుకూల నిర్ణ‌యం తీసుకున్నారు. మహారాష్ట్రలో మహిళా పోలీసుల పని గంటల్ని 12 నుంచి 8 గంటలకు తగ్గిస్తున్నట్లు డీజీపీ సంజయ్ పాండే గ‌తేడాది సెప్టెంబ‌ర్ లో వెల్ల‌డించారు. అయితే, త‌గ్గించిన ప‌ని గంట‌ల‌ను రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. దశల వారీగా రాష్ట్రమంతా దీన్ని విస్తరించబోతున్నట్లు పాండే వెల్లడించారు. ఈ మార్పులు నేప‌థ్యంలో  షిప్ట్ లు కూడా మారుస్తామని తెలిపారు. ఆ స‌మ‌యంలో రాష్ట్రంలోని నాగ్ పూర్, పూణే, అమరావతిలో ప్రాంతాల్లో మ‌హిళ‌ల‌కు  8 గంటల షిప్ట్ లు అమలు చేస్తున్నారు. వీటి త‌ర్వాత నవీ ముంబ‌యిలోనూ దీనిని అమ‌లు చేయ‌డానికి అధికారులు ఉత్త‌ర్వ‌లు జారీ చేశారు. 

ఇక మ‌హారాష్ట్రలోని మ‌హిళా పోలీసులంద‌రికీ ప‌ని గంట‌ల‌ను 12 నుంచి ఎనిమిది గంట‌ల‌కు త‌గ్గిస్తున్న‌ట్టు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సంజయ్ పాండే ఉత్త‌ర్వులు జారీ చేశారు. మహిళా పోలీసులకు ప‌ని గంట‌ల త‌గ్గించ‌డంపై హర్షం వ్యక్తమవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios