వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ ఫుట్‌బాల్ క్రీడాకారిని భవిష్యత్తును కోల్పోయింది. హిప్ జాయింట్ నుంచి కాలుపు కోల్పోవాల్సి వచ్చింది. 

చెన్నై: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ ఫుట్ బాల్ క్రీడాకారిణి కాలు కోల్పోయిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెడితే ఫుట్‌బాల్ క్రీడాకారిణి ఆర్‌ ప్రియా(18) చెన్నై నివాసి. ఆమె కుడి మోకాలు దెబ్బ తగిలింది. దీంతో దానికి శస్త్రచికిత్స చేసి సరిచేస్తే మరింత మెరుగ్గా ఫుట్ బాల్ ఆడగలుగుతుందని పెరియార్ నగర్ ప్రభుత్వ పరిధీయ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఆట మీద ఉన్న ప్రేమతో ఆమె దీనికి అంగీకరించింది. అయితే అదే తన పాలిట శాపంగా మారుతుందని తనను శాశ్వతంగా అంగవికలురాలిగా మారుస్తుందని ఆ సమయంలో ఆమె ఊహించలేకపోయింది. 

ప్రియ క్వీన్ మేరీస్ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో మొదటి సంవత్సరం విద్యార్థి. సోమవారం రెండో సర్జరీ తరువాత రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (RGGGH)లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో అపస్మారక స్థితిలో పడి ఉంది. నవంబర్ 7న ఆమెకు మొదటి శస్త్రచికిత్స చేశారు. దీంతో ఆమెకు చెడ్డరోజులు పోయాయని ఆమె తిరిగి ఆరోగ్యంగా మారుతుందని వారి కుటుంబసభ్యులు భావించారు. కానీ, ఆమెను దురదృష్టం వెంటాడింది. 

"ఆమె ఈ రోజు ఉదయం రెండవ శస్త్రచికిత్స చేయించుకుంది. హిప్ జాయింట్ కాలు మొత్తాన్ని తొలగించవచ్చని వైద్యులు మాకు చెప్పారు. మొదటి ఆపరేషన్ సమయంలో వారు కత్తిరించిన ప్రాంతం చుట్టూ ఉన్న కొన్ని మృత కణజాలాన్ని తొలగించారు. ఆమెకు ఎలివేటెడ్‌గా చికిత్స చేస్తున్నారు. ఆమె పరిస్థితి ఇంకా విషమంగా ఉంది" అని ఆమె సోదరుడు ఆర్ లారెన్స్ తెలిపారు.

RGGGHలోని వైద్యులు ఆమెకు మత్తు ఇచ్చే ఉంచారని, వెంటిలేటర్‌పై ఉంచారని తెలిపారు. వీటివల్ల ఆమె కిడ్నీలు, కాలేయానికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందేమోనని నిశితంగా పరిశీలిస్తున్నారు. "ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది, వైద్యుల బృందం తీవ్రంగా పర్యవేక్షిస్తుంది" అని ఆసుపత్రి డీన్ డాక్టర్ థెరానీరాజన్ చెప్పారు. 

"ఈ చికిత్స ద్వారా మరోసారి నెక్రోసిస్ (మృత శరీర కణజాలం) లేదా అవయవ వైఫల్యం ఉండదని నిర్ధారించడం’అని అతను చెప్పారు. అక్టోబరు 26న పెరియార్ నగర్ ఆసుపత్రి వైద్యులు ప్రియాతో మాట్లాడుతూ, MRI లో ఆమె లిగమెంట్ టియర్‌ని సూచిస్తున్నాయని తెలిపారు. దీనికోసం ఆపరేషన్ చేస్తే క్లియర్ అవుతాయని తెలిపారు. దీనికోసం ప్రియా, ఆమె సోదరులు రెండవ అభిప్రాయం కోసం ఆర్ జీజీజీహెచ్ వైద్యులను కలిశారు. 

‘వారు కూడా అది కరెక్టే నని చెప్పారు. వారి ఇంటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి పెరియార్ నగర్‌లో చికిత్స చేయించుకోవాలని సూచించారు’ అని మరొక సోదరుడు ఆర్ విజయ్ చెప్పారు. అయితే, తమకు ప్రయివేటు ఆస్పత్రిలో సర్జరీ చేయించుకునే స్థోమత లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రిలోనే చేయించకోవాలనుకున్నామని తెలిపారు. అందుకే పెరియార్ నగర్ లో చికిత్స చేయించామని తెలిపారు. ప్రియా తండ్రి ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

బలవంతపు మత మార్పిడి ప్రమాదకరం - సుప్రీంకోర్టు

ఈ ఆపరేషన్ల వల్ల తన కాలు బాగై.. తాను చక్కగా ఆడుతానని.. అలా స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రియ కలలు కన్నది. అందుకే సర్జరీకి ఒప్పుకుంది. అలా నవంబర్ 7న ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమెకు మొదటి ఆపరేషన్ చేశారు. సాయంత్రానికి వార్డుకు షిఫ్ట్ చేశారు. అయితే, ఆమె కాలు విపరీతంగా నొప్పి వస్తుందని ఫిర్యాదు చేసింది. టైట్ కంప్రెషన్ బ్యాండేజ్ వల్ల అలా అవ్వొచ్చని.. అది నొప్పి తగ్గడానికి సహాయపడుతుందని వైద్యులు ఆమెకు చెప్పారు. 

అయితే, ఆ రాత్రి తీవ్రమైన నొప్పితో ఆమె మూడుసార్లు లేచి అరుపులు, కేకలు వేసింది. డ్యూటీలో ఉన్న డాక్టర్లు ఆమెకు మత్తువచ్చేలా సెడెటివ్స్ ఇచ్చారని ఆమె బంధువులు చెప్పారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు, ఆమెకు శస్త్రచికిత్స చేసిన చోట బ్లడ్ క్లాట్ అయ్యిందన్న అనుమానంతో "రక్తం గడ్డకట్టింది" అని అనుమానించిన వైద్యులు ఆమెను RGGGH కి తరలించారు.

అన్ని రకాల పరీక్షలు చేసిన తరువాత వైద్యులు ఆమె కుడి కాలు మీద కణజాలం చనిపోయిందని, ఆమెను కాపాడాలంటే కాలు తీసేయాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. అలా నవంబర్ 9న వైద్యులు ఆమె కాలును తొలగించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించిన విచారణలో పెరియార్ నగర్‌లో వైద్యుల నిర్లక్ష్యం కనిపించింది. ఆమెకు చికిత్స చేసిన వైద్యులను బదిలీ చేయాలని సోమవారం ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ ఆదేశించారు. అయితే, వారి పేర్లను వెల్లడించడానికి నిరాకరించారు.

ప్రియాకు ఏర్పడిన నష్టానికి గానూ హై-ఎండ్ రోబోటిక్ ఆర్టిఫిషియల్ లింబ్, ఫిజియోథెరపీతో ఆమె పునరావాసానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆమె చేసిన అభ్యర్థనను కూడా పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన తెలిపారు.