Asianet News TeluguAsianet News Telugu

జొమాటో, స్విగ్గీ ఆల్‌టైమ్ రికార్డు: డిసెంబర్ 31న నిమిషానికో ఆర్డర్, బిర్యానీలో హైద్రాబాద్ ఫస్ట్

నూతన సంవత్సరం 2024 కు స్వాగతం తెలిపేందుకు  విందులు, వినోదాల్లో  ప్రజలు మునిగారు. పలు పుడ్ ఆర్డర్ యాప్ లకు  పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి.

Food, quick delivery platforms clock all-time high orders on New Year's Eve lns
Author
First Published Jan 2, 2024, 11:26 AM IST

న్యూఢిల్లీ:  2023 డిసెంబర్ 31న పలు పుడ్ డెలివరీ యాప్ లు  రికార్డు స్థాయిలో  ఆర్డర్లు పొందాయి.   డిసెంబర్  31న  జొమాటో  సంస్థ  రికార్డు స్థాయిలో  ఆర్డర్లను పొందింది. 2015 నుండి  2020 మధ్య కాలంలో  వచ్చిన ఆర్డర్లతో సమానంగా డిసెంబర్  31 రోజున ఆర్డర్లు వచ్చినట్టుగా  జొమాటో తేల్చి చెప్పింది.సోషల్ మీడియా వేదికగా  జోమాటో  సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు ఈ విషయాన్ని ప్రకటించారు.  జొమాటో  సీఈఓ  దీపిందర్  ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేశారు.  ఒక్క రోజులోనే జొమాటో  రికార్డు ఆర్డర్లను పొందిందన్నారు. 

జొమాటో డెలివరీ భాగస్వామ్యులకు రూ.97 లక్షల టిప్ అందినట్టుగా చెప్పారు. డిసెంబర్  31న అత్యధికంగా ఆర్డర్లు వచ్చినట్టుగా  బ్లింకింట్ సీఈఓ  అల్భిందర్ ధిండ్సా చెప్పారు. నిమిషానికో ఆర్డర్ వచ్చిందన్నారు. కూల్ డ్రింక్స్, చిప్స్ వంటివి ఆర్డర్స్ చేసినట్టుగా ఆయన చెప్పారు.

 జొమాటో ప్రత్యర్ధి స్విగ్గీ కూడ  గత రికార్డులను అధిగమించింది.గత రికార్డులను  స్విగ్గీ బద్దలు కొట్టిందని ఆ సంస్థ సీఈఓ రోహిత్ కపూర్ చెప్పారు.డిసెంబర్  31న చివరి గంటలో దాదాపు మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారని ఆ కంపెనీ తెలిపింది.

స్విగ్గీ నిమిషానికి  1,244 బిర్యానీలు ఆర్డర్లు వచ్చింది.  4,80,000 మంది బిర్యానీ ఆర్డర్ చేశారు.  బిర్యానీ ఆర్డర్ చేసిన నగరాల్లో హైద్రాబాద్, బెంగుళూరు, చెన్నైలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. రాత్రంతా ఉచిత డెలివరీలను స్విగ్గీ ప్రకటించింది.
 ఈ ఏడాది  10 మిలియన్ల మంది  ఇతరులకు కోసం ఆర్డర్లు చేసినట్టుగా స్విగ్గీ తెలిపింది

Follow Us:
Download App:
  • android
  • ios