బీహార్ లో ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది. 40 రోజుల శిశువు కడుపులో పిండం కనిపించడంతో వైద్యులు షాక్ అయ్యారు. ఇలా ఎందుకు జరిగిందో చెప్పుకొచ్చారు. 

పాట్నా : Biharలో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. 40 రోజుల పసికందు శరీరంలో Foetus పెరిగింది. బీహార్ మోతిహారి జిల్లాలోని రహ్మానియా Medical Center కు ఓ దంపతులు తమ 40-Day-Old Babyని తీసుకువచ్చారు. చిన్నారి పొట్ట వద్ద ఉబ్బెత్తుగా ఉండి శిశువు సరిగా మూత్రం పోయలేక పోతోందని వైద్యులు గుర్తించారు. దీనికి కారణాన్ని తెలుసుకునేందుకు సిటి స్కాన్ పరీక్షలు జరపగా విషయం బయటపడింది.

స్కానింగ్ రిపోర్ట్ చూసి వైద్యుడు తబ్రీజ్ అజీజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్నారి శరీరంలో ఓ పిండం ఉందని, అది పెరుగుతూ వస్తోందని గుర్తించారు. వైద్య పరిభాషలో దీన్ని ‘ఫీటస్ ఇన్ ఫెటు’ పిలుస్తారని.. శిశువు కడుపులో ఇంకో పిండం పెరగడాన్ని ఇలా అంటారని తెలిపారు. ఐదు లక్షల మందిలో ఒక్కరికే ఇలాంటి అరుదైన సమస్య వస్తుందని వివరించారు. విషయం తల్లిదండ్రులకు వివరించి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేసినట్లు వెల్లడించారు. చిన్నారి బాగానే కోలుకుందని, డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. 

ఇదిలా ఉండగా, మే24న Jammu and Kashmir లో ఓ ఘటన కలకలం రేపింది. newborn baby చనిపోయిందని ఆస్పత్రి వర్గాలు దృవీకరించాయి. ఆ శిశువును అంత్యక్రియలకు తీసుకుపోతుండగా ఒక్కసారిగా కదిలింది. దీంతో శిశువు బతికే ఉందని తెలిసి ఆ తల్లిదండ్రులు సంతోషంతో పొంగిపోయారు. బతికి ఉన్న శిశువును చనిపోయినట్లు ధృవీకరించిన వైద్యుల మీద మండిపడుతున్నారు. 

ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌ రాంబన్‌లోని సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బనిహాల్‌లో సోమవారం జరిగింది. ఇది ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యమే అని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిముందు బైఠాయించారు. ఈ ఘటన అధికారులకు చేరడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. ఘటన పూర్వాపరాలు గమనించిన అధికారులు, శిశువు కుటుంబ సభ్యుల నిరసనలకు దిగడంతో ఇద్దరు ఆసుపత్రి ఉద్యోగులను సస్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెడితే.. బంకూట్ నివాసి బషారత్ అహ్మద్ భార్య ఆసుపత్రిలో ప్రసవించింది. ఈ విషయాన్నికుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. కాసేపటికే పాప చనిపోయిందని ఆసుపత్రి సిబ్బంది కుటుంబసభ్యులకు తెలిపారు. పాప పుట్టిందని సంతోషించిన క్షణాల్లోనే చనిపోయిందని తెలవడంతో కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.. ఆ తరువాత కుటుంబసభ్యులు చిన్నారిని అంత్యక్రియలకు తీసుకెళ్లారు.

తీసుకెడుతున్న సమయంలో పసికందు కదులుతున్నట్లు గమనించిన కుటుంబ సభ్యులు ఇతరులను అప్రమత్తం చేశారు. వెంటనే, శిశువును మళ్లీ ఆసుపత్రికి తరలించారు, అక్కడ నుండి ప్రత్యేక చికిత్స కోసం శ్రీనగర్‌లోని ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఇలా జరుగుతుండగాను, SHO బనిహాల్ మునీర్ ఖాన్ నేతృత్వంలోని పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులను శాంతింపజేశారు.

"ఎస్‌డిహెచ్ బనిహాల్‌లోని గైనిక్ విభాగంలో పని చేస్తున్న జూనియర్ స్టాఫ్ నర్స్ సుమీనా బేగం, స్వీపర్‌ హజారా బేగంల నిర్లక్స్యమే ఘటనకు కారణమని తేల్చారు. మరణానికి సంబంధించి విచారణ పెండింగ్‌లో ఉంది, వీరిద్దరినీ తక్షణమే సస్పెన్షన్‌ చేశాం" అని అధికారులు తెలిపారు.