న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు.

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఇవాళ  ఉదయం పదకొండు గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.  మంత్రివర్గ సమావేశానికి ముందే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ తో పాటు  ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనుగార్ ఠాకూర్, కేంద్ర ఆర్ధిక శాఖకు చెందిన ముఖ్య అధికారులతో కలిసి  నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‌ను కలిశారు.

రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్‌ను కలిసిన తర్వాత  కేంద్ర మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.  కేంద్ర మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన తర్వాత పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.