కొంతమంది మగవారి బుద్ధి ఎప్పుడూ వక్రంగానే ఉంటుంది. పరాయి స్త్రీ కనిపిస్తేచాలు..వారిలోని వక్ర బుద్ధిని బయటపెడుతూ ఉంటారు.  అవతల పక్క ఉన్నది స్త్రీ అయితే చాలు.. పెళ్లి అయ్యిందా.. కాలేదా, చిన్నా, పెద్దా లాంటివి కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించారు. అలా ఓ వివాహితకు ఫ్లైయింగ్ కిస్స్ లు ఇస్తూ.. అసభ్యంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. ఫలితంగా మూడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రం మొహాలిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మొహాలి ప్రాంతానికి చెందిన వినోద్ అనే యువకుడు ఓ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నాడు. అదే అపార్ట్ మెంట్ లో వినోద్ ప్లాట్ కు ఎదురుగా ఓ మహిళ తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా వినోద్ సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె కనిపించిన ప్రతిసారి ఫ్లైయింగ్ కిస్సులు ఇవ్వడం... అసభ్యకర భంగిమలు చూపించడం లాంటివి చేస్తున్నాడు.

ఈ విషయంలో మహిళ భర్త వినోద్ కి పలు మార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినప్పటికీ అతనిలో మార్పు రాకపోవడం గమనార్హం. దీంతో విసిగిపోయిన ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా అతనిని కోర్టులో హాజరుపరచగా... మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధించారు.