ఇండిగో విమానంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకొని మృతి చెందాడు. ఈ విషాద ఘటన ముంబయి నుంచి రాంచీ వెళ్తున్న ఇండిగో విమానంలో చోటు చేసుకున్నది.
ఇండిగో విమానంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ముంబై నుంచి రాంచీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ఒక్కసారిగా రక్తపు వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. దీంతో ప్రయాణికులందరూ భయపడ్డారు. ఆ ప్రయాణికుడు ఆరోగ్యం క్షీణించడంతో కొద్దిసేపటికే మృతి చెందాడు. ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించడంతో పైలట్ నాగ్‌పూర్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే.. విమానం ల్యాండ్ అయ్యే సమయానికే ప్రయాణికుడు మృతి చెందాడు.
ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌కు ముందే.. నాగ్‌పూర్ విమానాశ్రయంలో కిమ్స్-కింగ్స్‌వే ఆసుపత్రి వైద్య బృందం ఉంది. వెంటనే ప్రయాణీకుడి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రయాణీకుడు కిడ్నీ వ్యాధి (సికెడి) తో బాధపడుతున్నట్లు తెలిపారు. విమానంలోనే చాలా సార్లు రక్తపు వాంతులు చేసుకున్నాడని, దాని కారణంగా అతను కొద్దిసేపటికే మరణించాడని చెప్పబడింది. తదుపరి విచారణ నిమిత్తం ప్రయాణికుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇద్దరు పైలట్ల మృతి
విమానంలో, విమానాశ్రయంలో మృతి చెందడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇద్దరు పైలట్లు కూడా ఇలాగే మరణించారు. కొద్ది రోజుల క్రితం.. నాగ్‌పూర్-పుణె విమానం ఎక్కే ముందు.. 40 ఏళ్ల పైలట్ విమానాశ్రయంలో మరణించాడు. మరణానికి కారణం గుండెపోటు తేలింది. ఇది కాకుండా.. ఢిల్లీ-దోహా వెళ్తున్న విమానంలో ఖతార్ ఎయిర్‌వేస్ పైలట్ విమానంలోనే మరణించాడు. విమాన ప్రయాణంలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ రెండు ఘటనల తర్వాత విమానయాన సంస్థలు ఒక ప్రకటన కూడా విడుదల చేశాయి.
