Asianet News TeluguAsianet News Telugu

ఫ్లైట్‌లోనే టిష్యూ పేపర్‌పై రైల్వే మంత్రికి వ్యాపారవేత్త ప్రతిపాదన: చర్చించిన రైల్వే అధికారులు


ఓ వ్యాపారవేత్త తాను  తన ఆలోచనను కేంద్ర మంత్రి దృష్టికి తేవడానికి చేసిన వినూత్న ప్రయత్నం ఫలితాన్ని ఇచ్చింది. 

Flyer pitches business idea to Railway Minister on napkin, lands a meeting lns
Author
First Published Feb 8, 2024, 10:49 AM IST

న్యూఢిల్లీ: తన వ్యాపార ఆలోచనలను  విమానంలో  ఓ వ్యాపారవేత్త  టిష్యూ పేపర్ పై  కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ దృష్టికి తెచ్చారు.ఈ విషయమై  రైల్వే అధికారులతో  వ్యాపార వేత్త చర్చలు సానుకూలంగా జరిగాయి.

అక్షయ్ సత్నాలివాలా అనే పారిశ్రామిక వేత్త కొన్ని రోజుల క్రితం కోల్‌కత్తాకు విమానంలో వెళ్తున్నాడు. అదే సమయంలో  విమానంలో  కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ను కలుసుకున్నాడు అక్షయ్ సత్నాలివాలా. ఈ నెల  2న  వీరిద్దరూ ఢిల్లీ నుండి కోల్‌కత్తాకు ఒకే విమానంలో వెళ్లారు. విమానంలో ప్రయాణీస్తున్న సమయంలో  కేంద్ర మంత్రిని చూసిన  పారిశ్రామిక వేత్త  సత్నాలివాలా తన ఆలోచనను  కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ తో చర్చించాలని భావించారు. అయితే  ఫ్లైట్ ప్రోటోకాల్, భద్రత కారణాల రీత్యా మంత్రిని ఆయన నేరుగా సంప్రదించలేకపోయారు.తన ఆలోచనను  టిష్యూ పేపర్ పై రాసి  కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ కు అందేలా చేశారు.

 ఆ టిష్యూ పేపర్ పై  ఆ పారిశ్రామిక వేత్త ఇలా రాశారు. ప్రియమైన సార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని  అతి పెద్ద  ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ  ఈస్టర్న్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నట్టుగా  ఆయన పేర్కొన్నారు.తన కంపెనీ గురించి వివరిస్తూనే తన వ్యాపార ఆలోచనను  కేంద్ర మంత్రి వైష్ణవ్ దృష్టికి తీసుకువచ్చారు.

  సరుకుల రవాణా సప్లయ్ చైన్ లో  రైల్వేలు ఎలా అంతర్భాగంగా ఉండవచ్చో... స్వచ్ఛభారత్  అభియాన్ కు  ఎలా సహకరిస్తాయో తాను వివరించాలనుకుంటున్నాన్నారు. కోల్‌కత్తాలో విమానం ల్యాండ్ అయిన తర్వాత తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయంలోని జనరల్ మేనేజర్ కార్యాలయం నుండి సత్నాలివాలాలకు ఫోన్ వచ్చింది. 

తూర్పు రైల్వే జనరల్ మేనేజర్  మిలింద్ కె దేవస్కర్  నుండి   సత్నాలివాలా ఫోన్ చేశారు.  సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కంపెనీ డైరెక్టర్ గా ఉన్న సత్నాలివాలాతో  ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి  రవాణా అవకాశాల గురించి చర్చించారు.

మంగళవారంనాడు తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయంలో  జరిగిన సమావేశానికి ముఖ్య అధికారులు కూడ హాజరయ్యారు. రాయ్‌పూర్, ఒడిశాలోని రాజ్ గంగాపూర్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పరిశ్రమల నుండి వేస్ట్ ఘనపదార్థాల తరలింపు విషయమై చర్చించారు.  ఈ విషయమై తూర్పు రైల్వే జనరల్ మేనేజర్  స్పందించారు.    వ్యర్థాల రవాణ చేయడానికి  అనువైన నిబంధనలను అందించారు. రైల్వే సహాయంతో  పెద్ద మొత్తంలో  వ్యర్థాల రవాణ చేయడం వల్ల రీసైక్లింగ్ కు దోహదపడడమే కాకుండా కాలుష్యం కూడ తగ్గిస్తుంది.కోల్‌కత్తా సిల్దా డివిజన్ లోని చిటాపూర్ యార్డు నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యర్థాలను తరలించే విషయమై  చర్చించారు. ఈ విషయమై  రైల్వే నిబంధనల మేరకు  ఆయా రైల్వే స్టేషన్లలో  వ్యర్థాల సేకరణకు సంబంధించి ధరకాస్తులు సమర్పించాలని కోరారు.

తూర్పు రైల్వే చీఫ్  రిలేషన్స్ మేనేజర్ కౌశిక్ మిత్ర  ఇండియా టుడే టీవీతో మాట్లాడారు.  రైల్వే మంత్రికి టిష్యూ పేపర్ పై చేసిన వినతిపై రైల్వే అధికారులు స్పందించినట్టుగా చెప్పారు. వ్యాపారవేత్త ఆలోచనలపై చర్చించి సానుకూలంగా స్పందించినట్టుగా చెప్పారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios