New Delhi: దేశంలోని అనేక ప్రాంతాలలో గత రెండు నెలలుగా దీర్ఘకాలిక అనారోగ్యం, దగ్గుతో అధిక సంఖ్యలో ఇన్ ఫ్లూయెంజా కేసులు నమోదవుతున్నాయి. రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారితో పోరాడిన తర్వాత ఇప్పుడు ఫ్లూ కేసులు పెరుగుతుండటం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది.
Flu (Influenza) cases are increasing in India : కరోనా లక్షణాలతో ఇన్ ఫ్లూయెంజా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాలలో గత రెండు నెలలుగా దీర్ఘకాలిక అనారోగ్యం, దీర్ఘకాలిక దగ్గుతో అధిక సంఖ్యలో ఇన్ ఫ్లూయెంజా కేసులు నమోదవుతున్నాయి. రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారితో పోరాడిన తర్వాత ఇప్పుడు ఫ్లూ కేసులు పెరుగుతుండటం సాధారణ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో దీర్ఘకాలిక దగ్గు, కొన్నిసార్లు జ్వరంతో కూడిన ఫ్లూ కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఐసీఎంఆర్ పలు కీలక సూచనలు చేసింది. కోవిడ్ లాంటి లక్షణాలను కలిగి ఉన్న ఫ్లూ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు పాటించాల్సిన, చేయకూడని పనుల జాబితాతో కూడిన సలహాను ప్రభుత్వం పంచుకుంది. సూచిస్తుంది.
ఫ్లూ కేసుల పెరుగుదల గురించి తాజా వివరాలు ఇలా ఉన్నాయి..
- భారతదేశం అంతటా అధిక సంఖ్యలో జ్వరం, ఫ్లూ కేసుల పెరుగుదల కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా గత రెండు మూడు నెలలుగా ఫ్లూ (ఇన్ ఫ్లూయెంజా) కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్య రిపోర్టులు పేర్కొంటున్నాయి.
- ప్రస్తుతం అధికంగా వ్యాపిస్తున్న ఫ్లూ (ఇన్ ఫ్లూయెంజా) ఏ-సబ్టైప్ హెచ్ 3 ఎన్ 2 (A subtype H3N2) కారణంగా వచ్చే ఫ్లూ ఇతర వేరియంట్ల కంటే ఎక్కువగా ఆసుపత్రిలో చేరడానికి కారణమవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది.
- హెచ్ 3 ఎన్ 2 వైరస్ ఇతర వేరియంట్ల కంటే ఎక్కువ ప్రభావితం చేస్తుందనీ, దీని కారణంగా ఆసుపత్రిలో చేరే రేటును పెంచుతుందనీ, గత రెండు మూడు నెలలుగా ఇది భారతదేశం అంతటా విస్తృతంగా వ్యాప్తిలో ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
- ఫ్లూ (ఇన్ ఫ్లూయెంజా) లక్షణాలు సాధారణంగా జ్వరంతో పాటు నిరంతర దగ్గును కలిగి ఉంటాయని పేర్కొంటున్న వైద్యులు.. ఇటీవలి కాలంలో చాలా మంది రోగులు దీర్ఘకాలిక లక్షణాల గురించి చెబుతున్నారని వెల్లడించారు.
- ''ఇన్ఫెక్షన్ బారినపడి దాని నుంచి కోలుకోవడానికి సమయం పడుతోంది. లక్షణాలు బలంగా ఉంటాయి. రోగి కోలుకున్న తర్వాత కూడా లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగుతాయి" అని వైద్యులు పేర్కొంటున్నారు.
- హెచ్ 3 ఎన్ 2 వైరస్ ఇతర ఇన్ ఫ్లూయెంజా ఉప రకాల కంటే ఎక్కువ ఆసుపత్రిలో చేరడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, కొత్త రకం ఇన్ ఫ్లూయెంజా ప్రాణాంతకం కాదని క్లినికల్ ట్రయల్ స్పెషలిస్ట్ డాక్టర్ అనితా రమేష్ చెప్పినట్టు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. 'ఇది ప్రాణాంతకం కాదు. కానీ కొంతమంది రోగులు శ్వాసకోశ సమస్యల కారణంగా అడ్మిట్ కావాల్సి వస్తుంది. కొన్ని లక్షణాలు కోవిడ్ ను పోలి ఉంటాయి' అని ఆయన చెప్పారు.
- దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్‌ను విచక్షణారహితంగా వాడకూడదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సూచించింది. యాంటీబయాటిక్స్ కాకుండా రోగలక్షణ చికిత్సను మాత్రమే సూచించాలని అసోసియేషన్ వైద్యులను కోరింది.
- వైరల్ కేసులు ఎక్కువగా 15 ఏళ్లలోపు, 50 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో సంభవిస్తాయనీ, జ్వరంతో పాటు ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయని ఐఎంఏ తెలిపింది.
- ఇన్ ఫ్లూయెంజా నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఐసీఎంఆర్ చేయాల్సినవి, చేయకూడని అంశాలను వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సబ్బు, నీటితో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, ఫేస్ మాస్కులు ధరించడం, రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం వంటివి ఈ పనులలో ఉన్నాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తే పారాసిటమాల్ వాడాలని ఐసీఎంఆర్ సూచించింది.
