Bihar: ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన విమానం.. పోలీసుల సూపర్ సొల్యూషన్.. వైరల్ వీడియో ఇదే

బిహార్‌లోని మోతిహరిలో ఓ విమానం ఫ్లై ఓవర్ కింద ఇరుక్కుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 

flight fuselage stuck under bihar flyover viral video is here kms

బిహార్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ ఫ్లైఓవర్ కింద విమానం ఇరుక్కుపోయింది. ఆకాశంలో ఎగరాల్సిన విమానం.. ఫ్లైఓవర్ కిందకు ఎలా వచ్చిందబ్బా? అక్కడ ఎలా చిక్కుకుంది? అనే కదా మీ డౌటు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.. పదండి.

అది ఇప్పుడు వినియోగంలో లేని విమానం. దాని సేవలు ముగిసిపోయాయి. ఆ విమానం బాడీని వేలం వేశారు. ముంబయికి చెందిన ఓ స్క్రాప్ డీలర్ ఈ విమాన బాడీని దక్కించుకున్నాడు. దీంతో ఈ విమానాన్ని అసోంకు పెద్ద లారీపై తీసుకెళ్లుతున్నారు.

ఈ లారీ బిహార్‌లోని గోపాల్ గంజ్‌‌కు జాతీయ రహదారి 28పై చేరగా.. అక్కడ ఓ ఫ్లై ఓవర్ అడ్డు వచ్చింది. డ్రైవర్ వెనుకా ముందు ఆలోచించాడు. గోపాల్ గంజ్‌లోని ఆ ఫ్లై ఓవర్ కింది నుంచి ముజఫర్‌పూర్ వైపుగా ముందుకు సాగితేనే.. ఆ లారీ అసోంకు చేరగలదు. మరో మార్గం లేదు. దీంతో ముందుకే గేర్ వేశాడు. ఆ ఫ్లై ఓవర్ నుంచి మెల్లిగా లారీని పోనిచ్చాడు. సగానికి పైగా ఆ విమానం ఫ్యూస్‌లెజ్ బయటపడింది. కానీ, చివరి భాగం మాత్రం ఆ ఫ్లై ఓవర్ కిందే ఇరుక్కుపోయింది. ఆ లారీ డ్రైవర్ అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. టెక్నికల్ అవకాశాలనూ చూశాడు. కానీ, ఆయనకు పరిష్కారం దొరకలేదు. అయితే.. ప్రయత్నం మాత్రం ఆపలేడు.

Also Read: Hyderabad: ఇకపై డ్రగ్ టెస్టులు కూడా.. టెస్టు కిట్‌లతో పోలీసులు.. ఈ కిట్‌లు ఎలా పని చేస్తాయి?

అది అసలే జాతీయ రహదారి. అందులోనూ రద్దీ ఎక్కువ. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్య పెద్దదైంది. ఆ విచిత్ర ఘటన చూడటానికి స్థానికులు వచ్చారు. సెల్ఫీలు తీసుకున్నారు. 

విమానం బాడీ ఫ్లై ఓవర్ కింద ఇరుక్కున్న విషయం తెలియగానే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. పిపారా కోతి పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో మనోజ్ కుమార్ సింగ్ పరిష్కారంగా అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు ఆ లారీ అన్ని టైర్ల నుంచి గాలిని తొలగించాలని సొల్యూషన్‌కు వచ్చినట్టు వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios