Asianet News TeluguAsianet News Telugu

గన్ కల్చర్ పై పంజాబ్ సర్కార్ కఠిన చర్యలు.. ఇకపై అలా చేస్తే జైలుకే..

తుపాకీ సంస్కృతిపై పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఆయుధాల కొనుగోలు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో రోజుకో తూటాలు పేలుతున్నాయని వార్తలు వస్తున్నా నేపథ్యం పంజాబ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడాన్ని పూర్తిగా నిషేధిస్తామని జారీ చేసిన మార్గదర్శకాలలో పేర్కొంది.

Flaunting Arms Banned In Punjab's Big Crackdown On Gun Culture
Author
First Published Nov 13, 2022, 4:30 PM IST

పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం గన్ కల్చర్ పై కఠినంగా వ్యవహరిస్తోంది. ఆయుధాల కొనుగోలు విషయంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఆయుధాల బహిరంగ ప్రదర్శనను నిషేధించడంతో సహా తుపాకీ యాజమాన్యం, ప్రదర్శనపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మార్గదర్శకాలను విడుదల చేసింది.

అలాగే.. ఆయుధాలు లేదా హింసను కీర్తిస్తూ పాడే పాటలను నిషేధం విధించింది. అలాగే.. వ్యక్తిగతంగా ఆయుధాల లైసెన్స్ కూడా అంత తేలికగా లభించదు. దీనికి సంబంధించి పలు నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో వివిధ ప్రాంతాల్లో ర్యాండమ్ చెకింగ్ జరుగుతుంది. 

తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఇప్పటివరకు జారీ చేసిన అన్ని ఆయుధాల లైసెన్స్‌లను రాబోయే మూడు నెలల్లో క్షుణ్ణంగా సమీక్షిస్తారు. అలా చేయడానికి అసాధారణమైన కారణాలు ఉన్నాయని, వ్యక్తిగతంగా ఆయుధాల లైసెన్స్ పొందాలంటే..జిల్లా కలెక్టర్ కు సంతృప్తికర వివరణ అందించాలి.

మానవ ప్రాణాలకు లేదా ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే ఆయుధాలను నిర్లక్ష్యంగా ఉపయోగించడం లేదా వేడుకల్లో తుపాకులను కాల్చడం శిక్షార్హమైన నేరం.ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయబడతాయి. అక్రమంగా తుపాకులు కలిగి ఉండడాన్ని నిరోధించడానికి వివిధ ప్రాంతాల్లో ర్యాండమ్ చెకింగ్ నిర్వహిస్తారు.

ఏదైనా సంఘంపై ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడే వారిపై పోలీసు కేసు కూడా నమోదు చేయబడుతుంది. వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.

తుపాకీ సంస్కృతిని ప్రోత్సహించే పాటలు, సాహిత్యంపై నిషేధం విధించింది. అటువంటి ధోరణిని ప్రోత్సహించడాన్ని పూర్తి నిషేధించింది. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు.గతంలో కొందరు పంజాబీ గాయకులు తుపాకీ సంస్కృతినీ,గూండాయిజం ప్రోత్సహించే పాటను నిషేధం విధించింది.

సమాజంలో హింస, ద్వేషం,  శత్రుత్వాన్ని పెంచుకోవడం మానుకోవాలని వారిని ప్రభుత్వం ఆదేశించింది.గత సంవత్సరం ప్రారంభంలో గన్ కల్చర్ ప్రోత్సహించే విధంగా  పాటలు పాడారని పంజాబీ గాయకుడు శ్రీ బ్రార్ ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios