ముంబై: నగరంలోని ధారావిలో శనివారంనాడు విషాదం చోటు చేసుకొంది. లిఫ్ట్ లో ఇరుక్కొని మహ్మద్ హోజైఫ్ షేక్ అనే బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కొని మరణించాడు.

షాహుర్ నగర్ లోని కోజీ షెల్టర్ అనే అపార్ట్ మెంట్ లో శనివారం నాడు హోజైఫ్ తన స్నేహితులతో కలిసి కింది ఫ్లోర్ కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. 

లిఫ్ట్ తో పాటు ప్లోర్ రాగానే డోర్ తెరుచుకోవడంతో హౌజైఫ్ లిఫ్ట్ నుండి బయటకు దిగారు. అందరికంటే లిఫ్ట్ నుండి బయటకు వచ్చిన షేక్ లిఫ్ట్ గ్రిల్స్ వేస్తుండగా వెనుక ఉన్న డోర్ మూసుకుపోయింది.

రెండు డోర్ల మధ్య జోహైఫ్ ఇరుక్కుపోయాడు. అదే సమయంలో కింది ప్లోర్ లో లిఫ్ట్ బటన్ నొక్కడంతో  రెండు డోర్ల మధ్య ఆ బాలుడు లిఫ్ట్ గ్రిల్స్ లో నలిగిపోయి మృతి చెందాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో కూడ ఇదే తరహాలో కూడా గతంలో లిఫ్ట్ లో చిక్కుకొని పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే.