Asianet News TeluguAsianet News Telugu

వీడిన ఐదు అస్తిపంజరాల మిస్టరీ: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని....

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పొలంలో బయటపడిన ఐదు అస్తిపంజరాల గుట్టును పోలీసులు ఛేిదించారు. ఇందుకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.

Five skeletons found in Madhya Pradesh: Murder mystery busted
Author
Bhopal, First Published Jul 1, 2021, 7:15 AM IST

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో బయటపడిన ఐదు అస్తిపంజరాల గుట్టు వీడింది. దేవాస్ పట్టణం నేమావర్ ప్రాంతంలో గల ఓ వ్యవసాయ క్షేత్రంలో ఐదు అస్తిపంజరాలు బయటపడడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారుల అస్తిపంజరాలను పోలీసులు వెలికి తీశారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. 

దేవన్ అదనపు సూపరింటిండెంట్ సూర్యకాంత శర్మ ఆ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు నేమావర్ గ్రామానికి ెచందిన మోహన్ లాల్ కాస్తే భార్య మమత (45), కూతురుళ్లు రూపాలి (21), దివ్య (14),  రవి  ఓస్వాల్ కూతురు పూజ (15), కుమారుడు పవన్ (14) మే 13వ తేదీన నుంచి కనిపించకుండా పోయారు. 

దర్యాప్తు చేపట్టిన పోలీసులు అధారాలు సేకరించి అదే గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ చౌహాన్, అతని తమ్ముడు భురూ చౌహాన్ లను విచారించారు. తామే వారిని హత్య చేసినట్లు వారు అంగీకరించారు. వారిని వ్యవసాయ క్షేత్రంలో పూడ్చిపెట్టినట్లు తెలిపారు. పోలీసులు వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని 10 అడుగుల లోతులో ప్రవేశపెట్టిన ఆ ఐదు అస్తిపంజరాలను జేసీబీ సాయంతో బయటకు తీసి ఫొరెన్సిక్ పరీక్షల నిమిత్తం తరలించారు. 

నిందితుడు సురేంద్ర సింగ్, రూపాలి కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు అయితే, సురేంద్ర మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు. దాంతో రూపాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు సురేంద్రను నిలదీశారు. దాంతో దాని గురించి మాట్లాడుకోవడానికి పొలం వద్దకు రావాలని చెప్పాడు. దాంతో తల్లి మమతతో పాటు సోదరి దివ్య, మరో ఇద్దరు పూజ, పవన్ లతో కలిసి రూపాలి అక్కడికి వెళ్లింది. అక్కడ గొడవ జరిగింది. 

ఆ క్రమంలో సురేంద్ర ఆ ఐదుగురిని హత్య చేశాడు. ఇందుకు సోదరుడు భూరూ సింగ్ మరో నలుగురు సహకరించారు. ఆ తర్వాత గోయి తవ్వి వారిని పూడ్చిపెట్టారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు సురేంద్ర రూపాలి సెల్ ఫోన్ ను ఓ వ్యక్తి కి ఇచ్చి పలు ప్రాంతాల్లో తిరగాలని చెప్పాడు. అయితే, పోలీసులు అసలు విషయం కనిపెట్టి ఆరుగురిని అరెస్టు చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios