ఓ ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. అతనికి ఐదు గుంజీల శిక్ష విధించారు ఆ గ్రామ పంచాయతీ పెద్దలు. దీంతో దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

బీహార్ : బీహార్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ పెద్దలు అని చెప్పుకునే కొంతమంది.. ఇచ్చిన తీర్పు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉంది. ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి విధించిన శిక్ష న్యాయవ్యవస్థనే అపహాస్యం చేసేలా ఉంది. వివరాల్లోకి వెడితే.. 
కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలనుకున్నారు.

కానీ, ఈ విషయంలో జోక్యం చేసుకున్న పంచాయతీ పెద్దలు దారుణమైన తీర్పు ఇచ్చారు. ఘటనను బయటికి రాకుండా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి ఐదు గుంజీల శిక్ష విధించారు. ఆ శిక్షతో అతడిని వదిలిపెట్టేశారు. దీంతో ఈ శిక్ష ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం గమనార్హం. అరుణ్ పాండ్యన్ అనే వ్యక్తి నవాదా ప్రాంతంలోని ఓ గ్రామంలో ఉన్న కోళ్ల ఫారంలో పని చేసేవాడు. కొన్నాళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ చిన్నారిపై కన్నేశాడు. ఆ చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపించి.. తీసుకెళ్లాడు. ఆ తరువాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

‘మా ఆయనకు సెక్స్ పిచ్చి ఉంది..వీడియోలు తీసి..’ సోనియాకు కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు..

విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెలుతుండగా.. నిందితుడు పనిచేస్తున్న కోళ్ల ఫారం యజమాని ఇందులో జోక్యం చేసుకున్నాడు. పోలీసులు దాకా వెడితే సమస్యలు వస్తాయని పంచాయతీలో ఆ విషయాన్ని తేల్చుకోవాలని సూచించాడు. అతని మాట తీసేయలేక వారు పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు. వారు గ్రామస్తులందరి ముందు నిందితుడికి 5 గుంజీలను శిక్షగా విధించారు. ఆ తరువాత అతడిని వదలి పెట్టారు. ఈ శిక్ష మీద గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ పంచాయతీ, శిక్షలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆ పంచాయతీ తీర్పు మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్ళింది. దీంతో ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. 

Scroll to load tweet…