త్రిపుర అసెంబ్లీలో రచ్చ.. అశ్లీల వీడియో చూశాడన్న బెంచ్‌ను గంగా జలంతో శుద్ధి.. ఐదుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు మొదలైన నిమిషాల్లోనే రచ్చ రచ్చగా మారిపోయింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వెల్ లోకి దూసుకెళ్లారు. టేబుల్స్ పైకి ఎక్కి హంగామా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 

five opposition mlas suspended by speacker after creating ruckus kms

న్యూఢిల్లీ: త్రిపుర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొన్ని నిమిషాల్లో హాల్ అంతా రచ్చ రచ్చగా మారిపోయింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బెంచ్‌లు వదిలి వెల్‌లోకి దూసుకువచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేతిలో చేయిలు వేసుకుంటూ చైన్‌గా మారిపోయి స్పీకర్ వైపుగా వచ్చారు. కొందరైతే హాల్‌లోని టేబుల్స్ ఎక్కి హంగామా చేశారు. ఇంకొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే జదాబ్ లాల్ దేబ్‌నాథ్ అసెంబ్లీలోనే అశ్లీల వీడియో చూస్తున్నట్టుగా చూపించే ఓ వీడియో ఈ ఏడాది తొలినాళ్లలో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎమ్మెల్యే  కూర్చున్న బెంచ్‌ను ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యే గంగా జలంతో శుద్ధి చేశారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ స్పీకర్ బిశ్వ బంధు సేన్ ఐదుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై రోజంతా సస్పెండ్ చేస్తూ ఆదేశించారు. అయితే, కొన్ని గంటల తర్వాత వారిపై సస్పెన్షన్‌ను ఎత్తేస్తూ స్పీకర్ నిర్ణయాలు తీసుకున్నారు.

బడ్జెట్ సెషన్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే తిప్రా మోతా పార్టీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అశ్లీల చిత్రాలు చూస్తూ వీడియోకు చిక్కిన బీజేపీ ఎమ్మెల్యే జదాబ్ లాల్ దేబ్‌నాథ్‌పై యాక్షన్ తీసుకోవాలని మూకుమ్మడిగా డిమాండ్ చేశాయి. ఈ మేరకు ప్రతిపక్ష నేత అనిమేశ్ దేబ్‌బర్మ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టి బీజేపీ ఎమ్మెల్యేపై చర్చించాలని పట్టుపట్టారు. ఈ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేల నిరసనలు ప్రారంభం అయ్యాయి.

Also Read: Islam Nusantara: ఐఎస్ఐఎస్ తీవ్రవాద భావజాలానికి ఇండియోనేషియా కౌంటర్ ఇదే

2023, 24 బడ్జెట్‌ను త్రిపుర ఆర్థిక మంత్రి పరణజీత్ సింఘ రాయ్ ప్రవేశపెడుతుండగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బిగ్గరగా నినాదాలు చేశారు.

ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చెందిన సుదీప్ రాయ్ బర్మన్, సీపీఎంకు చెందిన నయన్ సర్కార్, టీఎంపీకి చెందిన బరిషకెతు దేబ్ బర్మ,  నిందితా రియాక్, రంజిత్ దేబ్ బర్మలపై స్పీకర్ సేన్ సస్పెన్షన్ వేటు వేశారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అశ్లీల వీడియోలు చూస్తున్నట్టుగానున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios