అయోధ్య: ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణ హత్యకు గురయిన ఘటన అయోధ్య జిల్లాలో జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దంపతులతో పాటు వారి ముగ్గురు పిల్లలను నిందితుడు అతి దారుణంగా గొంతుకోసి హతమార్చాడు. 

ఈ హత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆస్తుల గొడదలో మామ కుటుంబం మొత్తాన్ని అల్లుడే హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.