జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.
జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టుగా జార్ఖండ్ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతిచెందిన మావోయిస్టులో.. ఇద్దరిపై రూ. 25 లక్షల చొప్పున రివార్డు, మరో ఇద్దరిపై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఘటన స్థానంలో రెండు ఏకే 47లను స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు.
