Asianet News TeluguAsianet News Telugu

కేరళను వణికిస్తున్న జికా వైరస్.. తాజాగా మరో ఐదుగురకి పాజిటివ్...

జికా వైరస్ ఏడెస్ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికి.. ఇప్పటివరకు మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. దీని బారిన పడిన వారిలో జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

Five more Zika cases detected in Kerala, total 28 now - bsb
Author
Hyderabad, First Published Jul 15, 2021, 11:24 AM IST

కరోనా కేసులతో సతమతమవుతున్న కేరళను జికా వైరస్ వేధిస్తుంది. చాపకింద నీరులా ఈ వైరస్ వ్యాపిస్తుంది. రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 28కి చేరినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది.

జికా వైరస్ ఏడెస్ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికి.. ఇప్పటివరకు మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. దీని బారిన పడిన వారిలో జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

పిల్లలకు సోకితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మరోవైపు కేరళ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆ రాష్ట్ర మొదట్లో వైరస్ ను కట్టడి చేసి ఆదర్శంగా నిలిచింది.  కానీ, సెకండ్ వేవ్ లో మాత్రం భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూశాయి. 

తర్వాత అవి తగ్గినట్టే తగ్గి మరోసారి పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి జూలై 17, 18 తేదీల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా అక్కడ 15 వేల మందికి ఈ వైరస్ సోకింది.

Follow Us:
Download App:
  • android
  • ios