New Delhi: నిషేధిత గ్రూప్ పీఎఫ్ఐకి చెందిన ఐదుగురి అరెస్టు చేసిన‌ట్టు జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ ) అధికార వ‌ర్గాలు తెలిపాయి. హవాలా, విదేశీ నిధులకు సంబంధించి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నామ‌ని పేర్కొంది. యూఏఈతో సంబంధాలున్న ఈ ఐదుగురు వ్యక్తులు బీహార్, కర్ణాటకలో హవాలా నెట్‌వర్క్ ను నడుపుతున్నారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.

5 Of Banned Group PFI Arrested: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే నిషేధిత సంస్థకు నిధులు తరలించిన ఐదుగురిని దేశ అత్యున్నత ఉగ్రవాద నిరోధక సంస్థ అరెస్టు చేసింది. యూఏఈతో సంబంధాలున్న ఈ ఐదుగురు వ్యక్తులు బీహార్, కర్ణాటకలో హవాలా నెట్‌వర్క్ ను నడుపుతున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. హవాలా లావాదేవీలో అధికారిక బ్యాంకింగ్ మార్గం గుండా వెళ్లకుండా వివిధ ప్రదేశాల్లో డబ్బు చేతులు మారుతున్న‌ద‌ని పేర్కొంది. అరెస్టయిన వారిలో నలుగురు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందినవారు కాగా, ఒకరు కేరళలోని కాసరగోడ్ కు చెందినవార‌ని తెలిపింది. వారిని మహ్మద్ సినాన్, సర్ఫరాజ్ నవాజ్, ఇక్బాల్, అబ్దుల్ రఫీక్, అబిద్ కేఎంగా గుర్తించారు.

దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కేరళ, కర్ణాటక, బీహార్ లలో పీఎఫ్ఐ తరలిస్తున్న నిధులను ట్రేస్ చేయడం, ట్రాక్ చేయడం అంశాల‌ను సంబంధించి బీహార్ లోని ఫుల్వారీషరీఫ్ పిఎఫ్ఐ కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు దక్షిణ భారతదేశంలో పెద్ద హవాలా ఆపరేటర్ల నెట్‌వర్క్ ను వెలికితీయడానికి దారితీసిందని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. బీహార్ లోని ఫుల్వారీషరీఫ్, మోతీహరిలోని పీఎఫ్ఐ సభ్యులు నిషేధిత గ్రూప్ కార్యకలాపాలను రహస్యంగా నిర్వహించాలని ప్లాన్ చేశారనీ, రాష్ట్రంలోని తూర్పు చంపారన్ జిల్లాలో ఒక వ్యక్తిని చంపడానికి ఆయుధాలను సమకూర్చారని ఎన్ఐఏ తెలిపింది. ఈ ప్ర‌క్రియ‌లో సంబంధం ఉన్న ముగ్గురు పీఎఫ్ఐ సభ్యులను ఫిబ్రవరి 5న అరెస్టు చేశారు.

తదుపరి దర్యాప్తు సుదీర్ఘ దాడుల‌కు, ఐదు తాజా అరెస్టులకు దారితీసిందని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది, "పీఎఫ్ఐ నాయకులు, క్యాడర్ కు పంపిణీ చేయడానికి భారతదేశం వెలుపల నుండి అక్రమ నిధులను తరలించడానికి, మళ్లించడానికి పీఎఫ్ఐ నేరపూరిత కుట్రలో ఈ ఐదుగురు చురుకుగా పాల్గొన్నట్లు కనుగొనబడింది" అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. గతవారం రోజులుగా కాసర్ గ‌ఢ్, దక్షిణ కన్నడలో సోదాలు నిర్వహిస్తున్న ఎన్ఐఏ బృందాలు డిజిటల్ పరికరాలు, కోట్లాది రూపాయల లావాదేవీల వివరాలతో కూడిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి.

"జూలై 2022 నుండి దర్యాప్తు ఆధారాల కోసం కొనసాగిస్తున్న ఎన్ఐఏ బృందం సెప్టెంబర్లో (గత సంవత్సరం) పీఎఫ్ఐపై నిషేధం విధించినప్పటికీ.. ఆ సంస్థ‌, దాని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు హింసాత్మక తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు. నేరాలు చేయడానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా ఏర్పాటు చేసుకుంటున్నార‌ని కనుగొన్నారు" అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. దుబాయ్, అబుదాబిలోని హవాలా నెట్ వర్క్ ల నుంచి కూడా ఈ ఐదుగురికి అక్రమ నిధులు అందాయని ఎన్ ఐఏ పేర్కొంది. నేరపూరిత కుట్రలో భాగంగా విదేశాల నుంచి హవాలా, విరాళాల ద్వారా నిధులు సేకరిస్తున్నారనే ఆరోపణలతో ప్రభుత్వం గత ఏడాది పీఎఫ్ఐపై నిషేధం విధించింది. బయటి నుంచి నిధులు, సైద్ధాంతిక మద్దతుతో దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందని" కేంద్ర హోంశాఖ 2022 సెప్టెంబర్ లో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.