చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా వలవనూరులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకొన్నారు.

వడ్డీవ్యాపారుల వేధింపుల వల్లే ఐదుగురు ఆత్మహత్య చేసుకొన్నారని  బంధువులు ఆరోపిస్తున్నారు.

మోహన్, ఆయన భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఆత్మహత్య చేసుకొన్నారని బంధువులు చెబుతున్నారు. వడ్డీ వ్యాపారులు డబ్బుల కోసం వేధింపులు చేయడంతో ఐదుగురు ఆత్మహత్య చేసుకొన్నారని ఆరోపిస్తున్నారు.

మోహన్ కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఈ విషయమై పోలీసులకు మృతుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.