తమిళనాడులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈరోడ్‌ జిల్లా అథియర్‌ వద్ద వ్యాన్‌ అదుపు తప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు.  

ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో మొత్తం 15మంది ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  కాగా మరణించిన వారంతా తోట పని చేసే కూలీలని తెలుస్తోంది.