బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్‌ జిల్లా హన్నూర్ తాలుకా పరిధిలో గల సులవధి గ్రామంలో పుడ్ పాయిజన్‌తో పదిమంది మృతి చెందగా, మరో 72 మంది పరిస్థితి విషమంగా ఉంది.

సులవధి గ్రామంలోని మారమ్మ దేవాలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ పూజలు నిర్వహించిన తర్వాత భక్తులకు ఇచ్చిన ప్రసాదం తిన్న భక్తులు అస్వస్థతకు గురయ్యారు.

వీరిలో  పదిమంది మృతి చెందగా. మరో 72 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.మృతి చెందిన వారిలో  ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి కూడ ఉన్నారు. అస్వస్థతకు గురైన వారిని  స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించి వైద్య చికిత్స అందిస్తున్నారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రసాదం శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు