మహారాష్ట్రలోని పుణెలో సోమవారంనాడు ఘోర ప్రమాదం జరిగింది. ఐరన్ హోర్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో సోమవారంనాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గాలివాన నుండి రక్షించుకొనేందుకు ఐరన్ హోర్డింగ్ కింద నిలబడిన వారిలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పుణె జిల్లాలోని పింప్రి చించ్వాడ్ నగరంలోని రావెట్ కివే ప్రాంతంలో ఈఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో నలుగురు మహిళలున్నారు.
