ఒడిశాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమికుల్ని బెదిరించి, కొండపైకి తీసుకువెళ్లిన దుండగులు.. వారిని వివస్త్రలుగా చేసి వీడియో తీశారు. దాంతో బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. 

భువనేశ్వర్ : ప్రేమికులను భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్ డివిజినల్ పోలీస్ అధికారి అరూప్ అభిషేక్ బెహర శనివారం తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. జయపురం పారాబెడకు కొంత దూరంలో ఇద్దరు ప్రేమికులు శుక్రవారం మాట్లాడుతూ వుండగా వారి వద్దకు ఇద్దరు యువకులు వెళ్లి భయపెట్టారు. తమ వద్ద ఉన్న కత్తిని చూపించి ప్రేమికులను సమీప కొండపైకి తీసుకువెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మరో ముగ్గురు దుండగులతో కలిసి ప్రేమికులను నగ్నంగా చేసి, ఫోటోలు వీడియోలు తీశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు రూ. 50,000 డిమాండ్ చేశారు.

అయితే, తమ వద్ద డబ్బులు లేకపోవడంతో రూ. ఏడు వేల నగదును ప్రేమికులు దుండగులకు ఇచ్చారని వెల్లడించారు. శనివారం మరో రూ. 13 వేలు ఇచ్చేందుకు అంగీకరించి, మిగతా రూ. 30,000 నెల రోజుల్లో ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. తర్వాత బంధువుల సహాయంతో వీరు శుక్రవారం రాత్రి.. పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేసి ఐదుగురు దుండగులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో జయపురం కౌదంబ వీధి టుకున జాని, రోహిత్ గరడ, దీపక్ సావుడ్, కపిల పొరిచ, ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, రూ.7వేల నగదు, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 

Nude Video Blackmail : ఫేస్‌బుక్ ప‌రిచ‌యం.. నగ్న వీడియో రికార్డ్ చేసి యువతిని బ్లాక్ మెయిల్

ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనలో.. ఓ మహిళ.. యువకుడికి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి.. నగ్నవీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడింది. అయితే, ఈ ఘటనలో బ్లాక్ మెయిల్ విషయం బయటపడడంతో ఆ మహిళ పరారయ్యింది. ఒక బట్టల షాపు నడుపుకునే యువకుడి వద్ద ఓ మహిళ బట్టలు తీసుకుని డబ్బు తరువాత చెల్లిస్తానని చెప్పింది. తెలిసిన మహిళే కదా అని అతను సరే అన్నాడు. మరుసటిరోజు యువకుడు ఆమెకు ఫోన్ చేయగా సాయంత్రం ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోమని ఆమె చెప్పింది. సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ అతనికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చింది. అది తాగిన ఆ యువకుడు స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత కిలాడీ మహిళ ఆ యువకుడితో చేసిన పాడుపనికి తెగబడింది. 

 వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలో జానీ అనే ఓ యువకుడు బట్టల షాపు నడుపుతుంటాడు. నగరంలోని అంబేద్కర్ కాలనీలో నివసించే ప్రతిమ(రియల్ నేం కాదు) అనే ఓ మహిళ జానీ షాప్ లో కొన్ని బట్టలు కొని డబ్బులు తర్వాత చెల్లిస్తానని చెప్పింది. ఆమెతో అంతకుముందే పరిచయం ఉండడంతో జానీ కూడా సరేనని ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ప్రతిమకు డబ్బుల కోసం ఫోన్ చేయగా ఆమె సాయంత్రం ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళమని చెప్పింది. ఆ రోజు సాయంత్రం ఆ మహిళ ఇంటికి జానీ వెళ్ళాడు. ఆమె అతడిని ఇంట్లోకి రమ్మని పిలిచి కూల్ డ్రింక్ ఇచ్చింది. ఆ కూల్ డ్రింక్ తాగిన కాసేపటికి అతను స్పృహ కోల్పోయాడు. 

ఆ తర్వాత ఆమె జానీ బట్టలు విప్పేసి అతడిని బెడ్ రూంలోకి తీసుకెళ్లింది. అక్కడ ప్రతిమ కూడా బట్టలు విప్పేసి స్పృహలో లేని జానితో కలిసి నగ్నంగా వీడియో చిత్రీకరించింది. ఆ తరువాత అతని నగ్న వీడియోలు చూపించింది. 50 వేల రూపాయల డబ్బు అడిగింది. డబ్బులు ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తానని blackmail చేసింది.. దీంతో జానీ ఆందోళన చెందిన జానీ పోలీసులు ఫిర్యాదు చేశాడు.