న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ  ఫిట్‌నెట్ నిపుణులతో ఇవాళ సంభాషించనున్నారు. ఫిట్‌ ఇండియా మూవ్ మెంట్ ఏడాది పూర్తి చేసుకొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన వారితో ఇవాళ మాట్లాడుతారు.

ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఫిట్ నెస్ నిపుణులు, ఫిట్ నెస్ పాటించే క్రీడాకారులతో మాట్లాడుతారు. అంతేకాదు ఆరోగ్యకరమైన దినచర్య గురించి ఆయన చర్చిస్తారు.

 

క్రికెటర్ విరాట్ కోహ్లీ, మోడల్, యాక్టర్  మిలీంద్ సోనమ్, న్యూట్రిషీయనిస్ట్ రూజత దివాకర్ తదితరులు ఇవాళ ప్రధాని మోడీతో ఫిట్ నెస్ గురించి చర్చిస్తారు.ఫిట్ ఇండియా డైలాగ్ దేశాన్ని ఫిట్ ఇండియాగా మార్చేందుకు ఒక ప్రణాళికను తయారు చేయడమే. 

ఫిట్ ఇండియా డైలాగ్ కార్యక్రమం కోసం  తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.