ఓ వైపు భారీ వర్షాలతో ముంబై మహానగరం వణికిపోతుంటే.. మరోవైపు కొందరు మాత్రం వర్షపు నీటిలో చేపలు పడుతూ ఏంజాయ్ చేస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ముంబైలోని సరస్సు, నల్లాల నుంచి చేపలు ఇతర జలచరాలు కొట్టుకొచ్చాయి.

దీంతో అత్యంత బిజీగా ఉండే ఈ ఎయిర్‌పోర్ట్‌లో పలువురు చేపలు పడుతున్నారు. దాదాపు 3 అడుగుల చేపలు.. ముఖ్యంగా క్యాట్ ఫిష్ రకానికి చెందినవి రావడంతో ఎయిర్‌పోర్ట్ సిబ్బందితో పాటు పలువురు స్థానికులు ఆసక్తిగా తిలకించగా.. కొందరు వాటిని హంటింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు.

ఓ వైపు భారీ సరస్సు, భారీ నల్లా.. మరోవైపు అరేబియా సముద్రానికి అరకిలోమీటరు సమీపంలోనే ఉన్న జుహూ ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి పరిస్థితి గతంలోనే జరిగిందని అధికారులు తెలిపారు.

వర్షాలు కురిసినప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు జుహూను ముంచెత్తుతుందని.. చిన్న వర్షం కురిసినా వరద వచ్చి ఎయిర్‌పోర్టులోని కొన్ని ప్రాంతాలు జలమయంగా మారతాయి.