Asianet News TeluguAsianet News Telugu

జికా వైరస్ కలకలం.. ఉత్తరప్రదేశ్ తొలి కేసు నమోదు.. అప్రమత్తమైన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో జికా వైరస్ కలకలం రేపుతున్నది. కాన్పూర్‌లో తొలి కేసు నమోదవ్వగా అధికారులు అప్రమత్తమయ్యారు. కనీసం 200 మంది ఆయన క్లోజ్ కాంటాక్టులను గుర్తించి ఐసొలేట్ చేశారు. ఆయన ట్రావెల్ హిస్టరీని ఇంకా పరిశీలిస్తున్నట్టు వివరించారు.
 

first zika virus detected in Uttar Pradesh
Author
Lucknow, First Published Oct 24, 2021, 5:06 PM IST

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జికా వైరస్ కలకలం రేపుతున్నది. కాన్పూర్‌లో తొలి జికా వైరస్ కేసు నమోదైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయన క్లోజ్ కాంటాక్టులను కనీసం 200 మందిని కనుగొన్నారు. వారందరినీ ఐసొలేషన్‌లో ఉంచారు. ఆయన ట్రావెల్ హిస్టరీని అధికారులు ఇంకా పరిశీలిస్తున్నారు.

కాన్పూర్‌లోని పొఖార్‌పురా ఏరియాలో నివసిస్తున్న వైమానిక దళానికి చెందిన ఓ ఉద్యోగికి జికా వైరస్ పాజిటివ్ వచ్చింది. తొలుత జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఆయన శాంపిల్స్‌ను టెస్టింగ్ కోసం ఆరోగ్య శాఖపూణెకు పంపించింది. ఈ టెస్టులో జికా వైరస్ పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆయన నివసిస్తున్న ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు. 200 మంది ఆయన క్లోజ్ కాంటాక్టులను గుర్తించి ఐసొలేట్ చేసినట్టు కాన్పూర్ చీఫ్ మెడికల్ అధికారి నేపాల్ సింగ్ తెలిపారు.

జికా వైరస్‌ ఉత్తరప్రదేశ్ కంటే ముందు కేరళ, మహారాష్ట్రలో నమోదైంది.

Also Read: మహారాష్ట్రలో జికా వైరస్ కేసు నమోదు: పుణె మహిళకు సోకిన వ్యాధి

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఎయిడెస్ దోమల ద్వారా జికా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇది తొలిసారిగా 1952లో ఉగాండా, టాంజానియాలో వెలుగులోకి వచ్చింది.

జికా వైరస్ సోకిన వ్యక్తిలో లక్షణాలు ఎక్కువగా సాధారణ స్థాయిలో జ్వరం, చర్మం దద్దుర్లు, కళ్లు ఎర్రగా మారడం, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి ఉంటాయి. ఇందులో చాలా వరకు లక్షణాలు రెండు నుంచి ఏడు రోజులపాటు కొనసాగుతాయి. ఈ వైరస్ లైంగికంగా కలవడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios